స్థానిక ఎన్నికలు జరపాలని పట్టుదలతో ఉన్న నిమ్మగడ్డ రోజుకో జిల్లాను సందర్శిస్తూ.. అక్కడి ఏర్పాట్లును పరిశీలించిన మీదట.. అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కడపలో పర్యటించిన నిమ్మగడ్డ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు జరపకుండా తనని ఏ శక్తి అడ్డుకోలేదని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు. రాజ్యంగబద్దంగా జరగాల్సిన ఎన్నికలను అడ్డుకోవాలనుకోవడం హాస్యస్పదంగా ఉందని పేర్కొన్నారు.
వైయస్సార్ జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా.. ఆయన వ్యక్తిత్వాన్ని, పాలనను గుర్తు చేసుకున్నారు నిమ్మగడ్డ. రాజ్యాంగ వ్యవస్థల పట్ల వైయస్సార్‌కు ఎంతో గౌరవమని, ఆయన వల్లే తానీ స్థాయికి చేరుకున్నట్లు చెప్పుకొచ్చారు. వైయస్సార్ హయాంలో నిజాలను నిర్భయంగా మాట్లాడే స్వేచ్ఛనిచ్చారని చెప్పారు. తన హృదయంలో వైయస్సార్‌కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పుకొచ్చారు. ఏకగ్రీవాలు తప్పు కాదని.. కానీ బలవంతపు ఏకగ్రీవాలు సహించబోమని హెచ్చరించారు. ఎవరైనా బలవంతంగా ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తే వారిని ఇంటికే పరిమతం చేస్తామని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలపై ఎన్నికల కమిషన్ నిఘా ఉంచిందని చెప్పుకొచ్చారు.
Must Read ;- భయభక్తులతో నిమ్మగడ్డ మీటింగులకు హాజరు!.











