బిగ్ బాస్ షోలో అందరి కంటే అదృష్టవంతుడు ఎవరంటే సోహైలే అనుకోవాలేమో. డబ్బుకు డబ్బు.. పేరుకు పేరు వచ్చేసింది. దాంతో పాటు ఇప్పుడు హీరోగా అవకాశం వరించేసింది. జార్జిరెడ్డి, ప్రెషర్ కుక్కర్ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈరోజు అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. శ్రీనివాస్ వింజనంపాటి దీనికి దర్శకుడు. వచ్చే ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఈ సినిమాకి సంబంధించి ఇతర వివరాలు వెల్లడి కావలసి ఉంది.
షోలో కూడా సోహైల్ కి వరాల మీద వరాలు కురిశాయి. తను సినిమా చేస్తానని, దాని ప్రీరిలీజ్ ఈవెంట్ కు అతిథి గా రావాలని సోహైల్ మెగాస్టార్ చిరంజీవిని కోరగా అందులో తను ఓ పాత్ర కూడా పోషిస్తానని చిరంజీవి హామీ ఇచ్చేశారు. అలాగే హాస్య నటుడు బ్రహ్మానందం కూడా అందులో నటిస్తానని హామీ ఇచ్చారు. సోహెల్ సినిమా నిర్మించేది ఎప్పుడోగాని ప్రస్తుతానికి మాత్రం ఓ సినిమాలో హీరోగా నటించేస్తున్నాడు. తను సినిమా చేయడం అంటే ఇదేనేమో అని కూడా అనుకోవాల్సి వస్తోంది. అలా అయితే ఇందులో చిరంజీవి ఓ పాత్ర పోషిస్తారా లేదా సోహైల్ నిర్మించే చిత్రంలోనా అన్నది స్పష్టత రావాలసి ఉంది.
Must Read ;- దారుణమైన కామెంట్స్ చెయ్యొద్దంటున్న సోహెల్











