దామచర్ల కుటుంబానికి టీడీపీ పార్టీలోనూ, ప్రకాశం జిల్లాలోనూ మంచి పేరు ఉంది. దివంగత నేత మాజీ మంత్రి దామచర్ల హనుమంత రావు కుటుంబం నుంచి రాజకీయాల్లో ప్రస్తుతం ఆయన మనుమడు దామచర్ల జనార్థన్ ఉన్నారు. 2012 నుంచి 2019 వరకూ టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు మోస్తూ.., 2014 లో ఒంగోలులో బాలినేనికి షాక్ ఇచ్చిన దామచర్ల జనార్థన్.., 2019లో అదే బాలినేని చేతిలో ఓటమి పాలయ్యారు. రూ. 2,800 కోట్ల రూపాయలతో ఒంగోలు నియజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టినా.., ప్రజలు తనను తిరస్కరించడంతో ఆయన ఆవేదనతో జిల్లా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 8 నెలల నుంచి కనీసం టీడీపీ పార్టీ ప్రకటించిన ఏ కార్యక్రమంలోనూ దామచర్ల కనిపించలేదు. కానీ, అకస్మాత్తుగా బుధవారం ఒంగోలు నగరంలో వరుస పర్యటనలు చేశారు.
వ్యూహాత్మకంగా దామచర్ల అడుగులు..!
8 నెలల తర్వాత మొదటిసారి దామచర్ల జనార్థన్ ఒంగోలు నియోజకవర్గంలో ప్రారంభించిన పర్యటన వ్యూహాత్మకంగా సాగింది. మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న దివ్యాంగురాలు భువనేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించిన దామచర్ల.., వరుసగా నగరంలో విస్తృతంగా పర్యటించారు. కమ్మ, కాపు సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉండే కమ్మపాలెం, గోపాల నగరం, సుజాతా నగర్, సత్యన్నారాయణ పురం లోనూ, బలహీన వర్గాల ఓట్లు ఉండే పాపా కాలనీలోనూ పర్యటించారు. స్థానిక ప్రజలను కలుస్తూ, మరణించిన కార్యకర్తల కుటుంబ సభ్యులకు సహాయం అందిస్తూ.., భువనేశ్వరి కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముందుకు సాగారు.
Also Read ;- ప్రకాశం జిల్లాకు అన్యాయం.. వైసీపీ నేతలు సైలెంట్!
ఇప్పుడు బరిలో నిలిస్తేనే భవిష్యత్తు..!
జమిలి ఎన్నికలు వస్తాయనే అనుమానాలు బలంగా ఉన్నాయి. ఎన్నికలంటూ వస్తే దామచర్ల మళ్లీ ఒంగోలులో బాలినేని ఢీ కొనక తప్పని పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక అనివార్యం. తాను ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధిని ప్రజలకు గుర్తుచేసి.., ఎన్నికల్లో విజయం సాధించాలని దామచర్ల ఆలోచిస్తున్నారు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకోగలిగితే బాలినేనికి ఒంగోలులోనే షాక్ ఇవ్వొచ్చన్నది దామచర్ల వ్యూహం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటితే.., జమిలి ఎన్నికల నాటికి.., టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదిరితే బాలినేనికి మళ్లీ షాక్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలవాలని దామచర్ల వ్యూహంగా కనిపిస్తోంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబంతో దామచర్లకు బంధుత్వం ఉండటం కూడా తనకు కలిసివచ్చే అంశమే. గత ఎన్నికల్లో కేంద్రంతో లోపాయికారి పొత్తుతో తనకు అన్ని దారులు క్లోజ్ చేసి ఓడించిన బలినేనిపై కచ్చితంగా విజయం సాధించాలనే కసితో దామచర్ల ముందుకు సాగుతున్నారు.
చూడాలి.., 18 నెలల నుంచి ఒంగోలుతో అంటీముట్టనట్లు ఉన్న దామచర్ల ఈ రోజు మాత్రం యాక్టివ్ అయినట్లే కనిపిస్తున్నారు. ఇదే విధంగా మందుకు సాగితే.., ఇప్పటికే బయటకు కనిపించకపోయినా? నివురు గప్పిన నిప్పులా ఉన్న వైసిపి గ్రూపు తగాదాలను వినియోగించుకుని స్థానిక ఎన్నికల్లో ఫ్యాను షాక్ ఇవ్వాలనే వ్యూహంతో దామచర్ల ముందుకు అడుగులు వేస్తున్నారు. చూడాలి స్థానిక సమరం ఒకే అయితే? గానీ ఒంగోలు రాజకీయం రంగు తెలిసేలా లేదు.
Must Read ;- విశాఖలో ముఠాకొట్లాటలతో ఫ్యాన్ కు చెమటలు!