‘బిగ్ బాస్ 4’ హౌస్ లోని పోటీదారుల్లో మొదటినుంచి తన ప్రత్యేకతను చాటుతూ వచ్చిన వ్యక్తిగా ‘సోహెల్‘ కనిపిస్తాడు. ఆయనలోని ఆవేశం .. దూకుడు ప్రేక్షకులకు నచ్చాయి. అలాగే “నేను చెయ్యా .. నేను ఆడా .. బరాబర్ ఉంటది .. కథ వేరుంటది” అంటూ తెలంగాణ యాసలో ఆయన తరచూ అనే మాటలు జనంలోకి బాగా వెళ్లాయి. ఇక గేమ్స్ విషయంలోను ఆయన తనదైన దూకుడు చూపించాడు. ఈ కారణంగానే ‘టాప్ 3’ పొజీషన్ కి సోహెల్ వెళ్లాడు.
‘టాప్ 3’ ప్లేస్ లో ఉండగా ‘బిగ్ బాస్‘ ఇచ్చిన ఛాయిస్ లో భాగంగా 25 లక్షలు తీసుకుని ఆయన స్టేజ్ దిగిపోయాడు.
మెహబూబ్ చేసిన సైగల కారణంగానే సోహెల్ ఆ నిర్ణయం తీసుకున్నాడనే కామెంట్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో సోహెల్ ఈ విషయంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ” మెహబూబ్ తన మూడు వ్రేళ్లు చూపిస్తూ ‘టాప్ 3’లో మేము ముగ్గురం ఉన్నామనే విషయాన్ని సైగలా ద్వారా చెప్పాడు. కానీ 25 లక్షలు తీసుకుని వచ్చేయమని చెప్పలేదు. అఖిల్.. నేను .. ఇద్దరిలో ఎవరం గెలిచినా 50 లక్షలను సమానంగా పంచుకోవాలని అనుకున్నాం. టాప్ 2 ప్లేస్ లో అఖిల్ ఉన్నాడు .. నా ఎదురుగా 25 లక్షల సూట్ కేస్ ఉంది.
ఆ మాత్రం వస్తే చాలని నేను అనుకోవడం వలన అది తీసుకున్నాను. మొదటి నుంచి కూడా సొంత ఇల్లు కట్టుకోవడమే తన డ్రీమ్ అని మెహబూబ్ నాతో అంటూ ఉండేవాడు. అందువలన నాకు వచ్చిన దాంట్లో నుంచి ఒక 5 లక్షలు మెహబూబ్ కి ఇస్తానని అన్నాను. మెహబూబ్ సైగలు చేయడం వల్లనే నేను 5 లక్షలు ఇస్తానన్నానని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. అది నాకు చాలా బాధ కలిగించింది. మొదటి నుంచి కూడా ‘బిగ్ బాస్’ హౌస్ లో నేను గేమ్స్ ఆడుతూ వచ్చాను.
ఆ సమయంలో గాయాలైనా లెక్కచేయలేదు. నేను మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చాను .. 25 లక్షలు మాకు చాలా ఎక్కువ. అందువలన ఆ సూట్ కేస్ ను అందుకోవడం జరిగింది. అంతేగానీ ఇందులో ఎలాంటి స్కామ్ లేదు. నేను బిగ్ బాస్ కి వెళ్లింది బిజినెస్ చేయడానికి కాదు .. నన్ను నేను నిరూపించుకోవడానికి. అందుకోసం కష్టపడ్డాను గనుకనే ప్రేక్షకులు ‘టాప్ 3’కి తీసుకొచ్చారు” అంటూ చెప్పుకొచ్చాడు.
Must Read ;- విజయ్ దేవరకొండకి ఒక థ్యాంక్స్ సరిపోదు బిగ్ బాస్ 4 విజేత అభిజిత్











