బిర్యానీ.. దీన్ని ఇష్టపడని వారు కూడా ఉంటారా అనిపిస్తుంది. ఒకవేళ అలాంటి వారు కూడా ఉంటే.. వారికసలు ఫుడ్ టేస్ట్ ఆస్వాదించడం రాదనే చెప్పాలి. మునపటి కాలంలో బిర్యానీ చేయాలంటే ప్రత్యేక సందర్భం లేదా ఏదైనా పెద్ద ఫంక్షన్ లాంటి సమయాల్లో మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడలా లేదు.. కేవలం తినాలని ఉండే చాలు.. వండకోవాల్సిన అవసరం కూడా లేకుండా వేడి.. వేడి.. బిర్యానీని తెచ్చి చేతికందిస్తున్నాయి ఫుడ్ యాప్స్. అలాంటి యాప్స్ చెప్పిన సమాచారం ప్రకారం, నగర ప్రజలు బిర్యానీని తెగ లాగించేసారట.
2020 యాప్స్ అందిస్తున్న ఫుడ్ లెక్కల ప్రకారం, లాక్ డౌన్ సమయంలో కూడా భారతీయులు ఎక్కువగా బిర్యానీలనే అర్డర్స్ ఇచ్చినట్లు చెప్తుంది. ప్రతిరోజు సెకనుకు ఒక ఆర్డర్‌ను అందుకున్నట్లు ఫుడ్ యాప్స్ చెప్తున్నాయి. జనవరిలో ఆఫీసు నుండి ఎక్కవగా ఉన్న ఆర్డర్లు మార్చి తర్వాత ఏప్రిల్-మేలలో లాక్ డౌన్ వల్ల ఇంటి నుండి ఆర్డర్స్ ఇచ్చే వారి సంఖ్య బాగా పెరిగిందని వెల్లడిస్తున్నారు. ఇక్కడ తెలసుకోవాల్సిన ఆసక్తికర విషయం మరొకటేంటంటే.. జనవరి-మార్చిలతో పోలిస్తే.. లాక్ డౌన్ సమయంలో బిర్యానీ ఆర్డర్లు 9 రెట్టు పెరిగినట్టు ఫుడ్ యాప్స్ వెల్లడించారు.
నైడ్ ఆర్డర్లు గతంలో పోలిస్తే లాక్ డౌన్ సమయంలో ఎక్కువగా ఉండేవని చెప్తున్నారు. నైట్ కర్ఫ్యూ లాంటి వల్ల ముందుగా అర్డర్లు ఎక్కువగా చేసే వారని అందులో అగ్రస్థానం బిర్యానీదేనట. ఆర్డర్ల ప్రకారం మధ్యాహ్నంతో పోలిస్తే నైట్ ఎక్కువ క్యాలరీల ఫుడ్‌ని ఆర్డర్ చేసినట్టు వారు చెప్తున్నారు. ఏదైమైనా.. దీని ద్వారా మన భారతీయులు ‘బిర్యానీ’ ప్రేమికులని మరోసారి నిరూపితమైంది.
Must Read ;- ఓ తల్లి ఆలోచనకు రూపమే ఈ ‘మసాలా బాక్స్’