మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కలయికలో వస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఆచార్య’. కరోనా హడావిడి తగ్గాకా.. మళ్ళీ టాలీవుడ్ లో షూటింగ్స్ సందడి మొదలైంది. ఆ లిస్ట్ లో ‘ఆచార్య’ మూవీ కూడా చేరింది. నిన్న మొన్నటి వరకూ చిరంజీవి లేని సీన్స్ ను చిత్రకరించారు. రీసెంట్ గా ఈ సినిమాలో చిరు పార్ట్ కూడా స్టార్ట్ అయింది. కరోనా పాజిటివ్, నెగెటివ్ గొడవ తర్వాత చిరంజీవి ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఆచార్య చిత్రీకరణలో పొల్గొంటూ.. తన పార్ట్ కంప్లీట్ చేయడానికి పూర్తిగా ఎఫెర్ట్ పెడుతున్నారు. ప్రస్తుతం చిరు, కొందరు ముఖ్య నటీనటుల కాంబినేషన్ లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు.
ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రలో చరణ్ నటించబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 40 నిమిషాలు ఉండే ఈ పాత్ర సినిమా కథను అనూహ్యమైన మలుపు తిప్పుతుందని ఇన్ సైడ్ వర్గాల వారి భోగట్టా. అందుకు తగ్గట్టే ఇందులో చరణ్ సరసన హీరోయిన్ గా పలువురు ముద్దుగుమ్మల పేర్లు వినిపించాయి. నిన్న మొన్నటివరకూ కన్నడ బ్యూటీ రష్మిక నటిస్తుందని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు కథానాయిక గా మరో బ్యూటీ పేరు వినిపిస్తోంది.
నిజానికి ఈ సినిమాలో చరణ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడని తెలియగానే.. ముందుగా వినిపించిన పేరు కియారా అద్వానీ. అయితే అప్పట్లో దాన్ని వట్టి రూమర్ గానే కొట్టిపడేశారు. ఆ తర్వాత వార్తల్లోకి రష్మికా పేరు వచ్చిచేరింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇందులో కియారా అద్వానీనే హీరోయిన్ గా ఫిక్స్ చేశారనే టాక్స్ వినిపిస్తున్నాయి. ఆల్రెడీ కియరా చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’లో నటించింది. అంతేకాదు.. అమ్మడికి డ్యాన్సింగ్ టాలెంట్ బాగా ఉంది. అందుకే రామ్ చరణ్ సరసన ఆ ముద్దుగుమ్మనే ఖాయం చేస్తారనే మాట ఇప్పడు బలంగా వినిపిస్తోంది. మరి చరణ్ పక్కన కియారా అద్వానీనే కన్ఫర్మ్ చేస్తారేమో చూడాలి.











