మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, టాలీవుడ్ కింగ్ నాగార్జున తనయులు నాగ చైతన్య, అఖిల్.. హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం.. ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కెరీర్ లో దూసుకెళుతుండడం తెలిసిందే. నందమూరి నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే…. సమయం వచ్చినప్పుడు నేనే ప్రకటిస్తానని గతంలో బాలయ్య చెప్పారు. ఇక విక్టరీ వెంకటేష్ తనయుడు అర్జున్ ప్రస్తుతం చదువుకుంటున్నాడు. ఒకవేళ సినిమాల్లోకి రావాలనుకుంటే… ఇంకొంచెం టైమ్ పట్టచ్చు.
ఇదిలా ఉంటే… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ సినిమాల్లోకి రానున్నాడని.. వార్తలు వస్తున్నాయి. ఆమధ్య అకిరానందన్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ట్విట్టర్ ద్వారా బర్త్ డే విసెష్ తెలియచేశారు. ఈ ట్వీట్ లో చిరంజీవి అకిరా హైట్ 6.4 అని తెలియచేశారు. అంతే కాకుండా.. ఈ బిడ్డ ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు. హైటు 6’4. అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలానే మించిపోవాలి అంటూ ఆశీస్తూ… ఆశీస్సులు అందించారు. అకిరా హైటు 6.4 అని తెలిసినప్పటి నుంచి అప్పుడే అకిరా ఎంత ఎత్తుకు ఎదిగిపోయాడా అని ఒకింత ఆశ్యర్యం.. ఆనందంతో మెగా అభిమానులు అకిరా సినిమాల్లో ఎంట్రీ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
Also Read ;= మెగా కోడలి వెబ్ పోర్టల్ కి, కన్నడ బ్యూటీ కి లింకేంటి?
అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ గురించి అభిమానుల్లో ఎప్పటికప్పుడు హాట్ డిబేట్ నడుస్తూనే ఉంటుంది. సినిమాలు..రాజకీయాలు అంటూ పవన్ రెండు పడవల ప్రయాణం సాగిస్తున్నారు. ఈ ప్రయాణంలో అంతిమంగా తన దారి రాజకీయాలేనని ఇప్పటికే స్పష్టత నిచ్చారు పవన్. అయితే… వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇస్తూన్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే… రీసెంట్ గా రేణుదేశాయ్.. కుమారుడు అకిరానందన్, కుమార్తె ఆద్యతో పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ ఫోటో చూసినప్పటి నుంచి అకిరా టాలీవుడ్ ఎంట్రీ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.
అకిరా ప్రస్తుతం నటనలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడని తెలిసింది. ఇప్పటికే అకీరా 16వ ఏటలోకి అడుగు పెట్టేశాడు. నూనూగు మీసాలతో.. యంగ్ హీరోలా స్మార్ట్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. అకిరా ఫస్ట్ మూవీని నిర్మించే బాధ్యతను బాబాయ్ పవన్ కళ్యాణ్ – అబ్బాయ్ రామ్ చరణ్ కి ఇచ్చారని.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ లో అకిరా ఫస్ట్ మూవీ ఉంటుంది అంటున్నారు. టీనేజీ ప్రేమకథలకు అతడు యాప్ట్ అని అభిమానులు భావిస్తున్నారు. రేణుదేశాయ్ తెరకెక్కించిన ఇస్క్ వాలా లవ్ సినిమాలో అకిరా బాల నటుడుగా నటించాడు. దీనిని బట్టి అకిరాకి నటన పై ఆసక్తి ఉందనే విషయం తెలుస్తుంది. అకిరా ఎంట్రీ గురించి వార్తలు వస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు. అలాగే చరణ్ కూడా అకిరా గురించి కానీ అకిరా ఎంట్రీ గురించి కానీ స్పందించలేదు. మరి… సోషల్ మీడియాలో అకిరా ఎంట్రీ గురించి విపరీతంగా వస్తున్న వార్తల పై పవన్ కళ్యాణ్ స్పందిస్తారేమో చూడాలి.
Must Read ;- పందిమాంసం అంటే మిక్కిలి మక్కువ అంటోన్న కన్నడ బ్యూటీ











