కోవిడ్ 19 మహమ్మారి ప్రస్తుతం దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ .. ఫస్ట్ వేవ్ కన్నా భయంకరమైన అనుభవాన్నిస్తోంది జనానికి. అయితే ఈ రెండు వేవ్స్ లోనూ.. మానవత్వాన్ని చాటుకుంటూ.. కోవిడ్ బాధితులకు అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తూ.. తనో వేవ్ క్రియేట్ చేసుకున్నాడు వెండితెర విలన్ సోనూ సూద్. ఇప్పుడు అతడు అందరి గుండెల్లోనూ దేవుడు, దేశానికి రియల్ హీరో.
కేవలం రెండే రెండేళ్ళల్లో సినీ హీరోల ఇమేజ్ ను దాటుకుంటూ.. ఎనలేని ఇమేజ్ ను ఏర్పరుచుకున్నాడు సోనూభాయ్. అలాంటి అతడ్ని ఇప్పుడు సిల్వర్ స్ర్కీన్ పై ఇంకా విలన్ గా చూపిస్తే .. జనం నుంచి వ్యతిరేకత ఏర్పడుతుందని భయపడుతున్నారు భారతీయ దర్శకులు. అందుకే అతడ్ని హీరోగా పెట్టి సినిమాలు తీసేందుకు దర్శక, నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే సోనూ .. తనకి విలన్ గా నటించడమే ఇష్టమని, హీరోగా అంతగా ఆసక్తి లేదని చెబుతుండడం ఆశ్చర్యమనిపించక మానదు.
అయినప్పటికీ.. సోనూ సూద్ హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా తీయడానికి టాలీవుడ్ దర్శకుడు క్రిష్ ప్రయత్నాలు ప్రారంభించడం విశేషంగా మారింది. కరోనా మహమ్మారి పేరు చెప్పి.. దేశ వ్యాప్తంగా వెల్ నోన్ పెర్సన్ అయిపోయిన సోనూ భాయ్ తో పాన్ ఇండియా సినిమా తీస్తే దానికి మంచి క్రేజ్ ఏర్పడుతుందని క్రిష్ భావిస్తున్నాడు. ఆ మేరకు ఒక అద్భుతమైన స్టోరీని కూడా క్రిష్ రెడీ చేశాడట.
నిజానికి సోనూ సూద్ .. కంగనా నటించిన ‘మణికర్ణిక’ లో ఓ ప్రధాన పాత్రకు ఎంపికయ్యాడు. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు సోనూ సూద్. అలాగే.. క్రిష్ సైతం మణికర్ణిక సినిమాని 70 శాతం షూట్ చేసి .. ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి క్రిష్, సోనూ సూద్ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో కలుస్తుండడం హాట్ టాపిక్ అయింది. క్రిష్ స్టోరీకి బాగా ఇంప్రెస్ అయిన సోనూసూద్ .. ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. మరి పాన్ ఇండియా స్టార్ గా సోనూ సూద్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతాడో చూడాలి.
Must Read ;- కలెక్టర్ కోరగానే ఓకే అనేసిన సోనూ సూద్