దర్శకుడు గుణశేఖర్ .. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ లో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఎపిక్ లవ్ స్టోరీ ‘శాకుంతలం’. మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రణయగాథను.. టాలీవుడ్ సెల్యులాయిడ్ పై అద్భుతంగా ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు గుణశేఖర్. ఇందులో శకుంతలగా అందాల సమంత నటిస్తుండగా.. దుష్యంతుడుగా మలయాళ నటుడు దేవ్ కమల్ ఎంపికయ్యాడు. ఇక ఈ సినిమా నేడు అన్నపూర్ణ స్డూడియోస్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవం జరుపుకుంది.
ఈ కార్యక్రమానికి స్టార్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, దిల్ రాజు హాజరయ్యారు. కాగా దర్శకుడు గుణశేఖర్, నిర్మాత నీలిమ, హీరోయిన్ సమంత, హీరో దేవ్ కమల్ ఈ సినిమా విశేషాల్ని తెలియచేశారు. ఇక గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమాను కేవలం ఆరు నెలల్లోనే షూటింగ్ ను కంప్లీట్ చేసి.. మరో ఆరు నెలల కాలం గ్రాఫిక్స్ కోసం కేటాయించబోతున్నాడని సమాచారం. మణిశర్మ సంగీతం అందిస్తున్న శాకుంతలం చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాలోని ఇతర ముఖ్యపాత్రల కోసం వివిధ భాషలనుంచి నటీనటుల్ని ఎంపిక చేయబోతున్నారట.
Must Read ;- పాన్ ఇండియా దిశగా శాకుంతలం