యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. జక్కన్న చెక్కుతోన్న ఈ భారీ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్ 13న పాన్ ఇండియా కేటగిరిలోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ విడుదలకు సిద్ధం కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది.
ఇక ఈ వారాంతంలో ఆర్.ఆర్.ఆర్ మూవీకోసం ఓ భారీ సాంగ్ ను షూట్ చేయబోతున్నారట. రామ్ చరణ్, ఆలియా భట్ మీద చిత్రీకరించే ఈ రొమాంటిక్ సాంగ్ కోసం హైద్రాబాద్ లో అత్యంత భారీ గా సెట్ వేస్తున్నారట. 1920 కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ .. ఓ చారిత్రక కట్టడాన్ని నిర్మిస్తున్నారట. అందులోనే వీరిద్దరి మీద సాంగ్ షూట్ చేస్తారట. సాబు సిరిల్ ఆర్ట్ డైరెక్షన్ లో వెలిసిన ఈ సెట్ ఈ సినిమాకే హైలైట్ కానుందట. యం.యం. కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈసినిమాలోని పాటలు.. ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని చెబుతున్నారు. మరి చరణ్, ఆలియా రొమాన్స్ ఏ రేంజ్ లో అభిమానుల్ని మెప్పిస్తుందో చూడాలి.
Must Read ;- ఆర్.ఆర్.ఆర్ మూవీ క్లైమాక్స్ విషాదాంతమా? నిజమేనా?