‘ఆర్.ఆర్.ఆర్’.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. సినీ ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ మూవీ హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల యాభై రోజుల షూటింగ్ ను పూర్తి చేసుకుంది. భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించారు. భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. పక్కా ప్లానింగ్ తో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నారు.
ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుంటే… రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు. చరణ్ సరసన సీతగా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తోంది. కరోనా ముందు చరణ్, అలియాభట్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. మార్చి నెలలో అలియా పై కీలక సన్నివేశాలు చిత్రీకరించాలి అనుకుంటే కరోనా కారణంగా ఆగింది. అయితే.. అలియా బాలీవుడ్ లో బిజీ యాక్ట్రెస్. అందుకే కరోనా కారణంగా షూటింగ్ క్యాన్సిల్ అయిన తర్వాత అలియాభట్ డేట్స్ ఇస్తుందో ఇవ్వదో.. అనుకున్నారు.
అంతే కాకుండా..అలియా ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది అని వార్తలు కూడా వచ్చాయి. అయితే..అలాంటి వార్తలకు ఇక ఫుల్ స్టాప్ పడినట్టే. ఎందుకంటే.. ఈరోజు అలియాభట్ ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ లో జాయిన్ అయ్యింది. డిసెంబర్ 6వ తారీఖు మధ్యాహ్నాంకు అలియాభట్ హైదరాబాద్ చేరుకుంది. సౌత్ లో అలియాభట్ నటిస్తున్న ఫస్ట్ మూవీ ఇదే కావడం విశేషం. ఆమెకు రాజమౌళి వర్క్ అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో ఆయనతో వర్క్ చేయాలి అనుకుంది. అందుకనే రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ లో సీత క్యారెక్టర్ చెప్పగానే వెంటనే ఓకే చెప్పేసిందట.
చరిత్రలో ఎప్పుడూ కలవని అల్లూరి సీతారామరాజు – కొమరం భీమ్ కలిస్తే.. ఎలా ఉంటుందో ఇందులో చూపిస్తున్నాం అని చెప్పారు రాజమౌళి. కథ గురించి ముందే చెప్పేసినప్పటికీ.. అంచనాలు మరిన్ని పెరిగాయి అని చెప్పచ్చు. ఏ సినిమా కథను ముందుగా చెప్పాలో.. ఏ సినమా కథను ముందుగా చెప్పకూడదో రాజమౌళికి బాగా తెలుసు. అందుకనే ఆయన అపజయం అనేది తెలియకుండా వరుసగా సంచలన విజయాలు సాధిస్తూ.. చరిత్ర సృష్టిస్తున్నారు. మరి.. ‘ఆర్.ఆర్.ఆర్’ తో కూడా రాజమౌళి మరోసారి చరిత్ర సృష్టిస్తారని ఆశిద్దాం.
Must Read ;- నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ?











