ఫ్యాషన్ విషయానికి వస్తే సెలెబ్రిటీలు వేసుకున్న దుస్తులనే ప్రేరణగా తీసుకుంటారు అభిమానులు. మన దగ్గర ఎన్ని రకాల దుస్తులు ఉన్నాసరే మనం వాటిని ఏ విధంగా ధరించాం.. అనే దాని మీదే మన స్టైల్ ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో బాలీవుడ్ ఫ్యాషనిస్టులకు మనం థాంక్స్ చెప్పుకోక తప్పదు. ఎందుకంటే మన బాలీవుడ్ సెలెబ్రిటీల స్టైల్ వెనుక ఉన్నది వాళ్ళే కదా.
రేడ్ కార్పెట్ మీద నడవడానికైనా లేదా ఏదైన కార్యక్రమానికి వెళ్లడానికైనా, దుస్తుల ఎన్నికకు ప్రతీ సారి సెలెబ్రిటీలు ఒక కొత్త తరహా స్టైల్ లో కనిపిస్తూ కనువిందు చేస్తూ ఉంటారు. అలానే ఈ వారం మన సెలెబ్రిటీలు, అద్భుతమైన దుస్తులకు తమ అంద చందాలు జోడించి ఉత్తమ దుస్తులు ధరించిన వారి జాబితాలో చేరిపోయారు. ఈ వారం, సమంతా అక్కినేని, నోరా ఫతేహి, కియారా అద్వానీ వంటి ప్రముఖులు ఉత్తమ దుస్తులు ధరించిన జాబితాలో చోటు దక్కించుకున్నారు.
కియారా అద్వానీ
ఈవారం కియారా అద్వానీ మైమరిపించే నారింజ వర్ణం, గులాబీ రంగుతో ఫ్రిల్స్ ఉన్న టాప్ తో అందంగా కనిపించింది. ఈ దుస్తుల మీద ఒక చక్కటి బంగారు గొలుసుతో కెరటాలు లాగా ఉండే హెయిర్ స్టైల్ తో అందరి కళ్ళు ఆమె పైన తిప్పుకునేలా చేసింది.

ఉపాసన కామినేని
మెగా డాటర్ నాగబాబు కుమార్తె నిహారిక పెళ్ళిలో, రామ్ చరణ్ భార్య ఉపాసన వైన్ రంగుతో చేసిన అందమైన చీర, ఎవ్ల్వెట్ బ్లౌజ్ తో మెరిశారు. మన సంప్రదాయ లుక్ కు బంగారు అభరణాలను జోడించి, తన జుట్టు రంగు, అందమైన ఎర్రటి బొట్టుతో ఎంతో అందంగా కనిపించారు. సంప్రదాయ దుస్తులు ధరించే వారికి ఇదొక చక్కటి చిట్కాగా తీసుకోవచ్చు.
Must Read ;- పందిమాంసం అంటే మిక్కిలి మక్కువ అంటోన్న కన్నడ బ్యూటీ

నోరా ఫతేహి
నోరా ఈవారం చాలా సాధారణమైన లుక్ లో కనిపించింది. ఒక స్లీవ్ లెస్ టీ షర్ట్, బ్లూ డెనిమ్ జీన్స్, న్యూడ్ పాయింట్ హీల్స్, చేతిలో ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ తో కనిపించింది. తను ధరించిన బ్లాక్ గుషి బెల్టు హైలైట్ గా కనిపించింది. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళేటప్పుడు ఈ లుక్ ను ట్రై చేయొచ్చు మరి.

సమంత అక్కినేని
సమంత తన బంగారు వర్ణంలో ఉన్న మంచి డ్రెస్ తో అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ డ్రెస్ చాలా సౌకర్యంగా కనిపించింది. మీరు కూడా మంచి పార్టీలకు వెళ్ళేటప్పుడు ఈ విధమైన దుస్తులను ట్రై చేయండి.

తమన్నా భాటియా
ఈవారం తమన్నా చాలా సహజంగా మంచి లేత గులాబీ రంగు తీ షీర్ట్, బాయ్ ఫ్రెండ్ అనే కంపెనీ జీన్స్ తో మంచి స్పోర్ట్స్ లుక్ లో కనిపించింది. తెలుపు రంగు స్నేక్ర్స్, నలుపు రంగు హ్యాండ్ బ్యాగ్ తో మరింత స్టైల్ గా కనిపించింది తమన్నా.
Also Read ;- సామ్ జామ్లో ఫ్యాషన్ దుస్తులతో ప్రేక్షకులను కట్టిపడేసిన తమన్నా.. !
