విజయవాడ కృష్ణలంక, గుంటూరు జిల్లా కుంచనపల్లిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోన్న 11 మందిని స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో సెబ్ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. వారి నుంచి రూ.63 వేలు నగదు,18 సెల్ ఫోన్లు, టీవీ, ల్యాప్ టాప్, 3 వాహనాలు సీజ్ చేశారు. అరెస్టైన వారిలో ప్రసాదంపాడు, రామవరప్పాడుకు చెందిన వైసీపీ నేతలు కూడా ఉండటం విశేషం.
అధికారం అండతోనే
ఏపీలో పేకాట, క్రికెట్ బెట్టింగ్, ఆన్ లైన్ పేకాటను ప్రభుత్వం నిషేధించింది. దీన్ని ఆసరాగా చేసుకుని అధికార పార్టీ నేతలే రెచ్చిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. లంకల్లో పేకాట నిర్వహించడం, క్రికెట్ బెట్టింగులు, ఆన్ లైన్ పేకాటలు నిర్వహిస్తూ అధికార పార్టీ నేతలు అందినకాడికి దండుకుంటున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అక్రమంగా మద్యం తరలింపు వ్యవహారాలు, అక్రమంగా ఇసుక తవ్వకాలు, అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలు నిర్వహిస్తూ అధికార వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలు ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో వెలుగు చూస్తున్నా ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Must Read ;- వైసీపీ నేతల అండతో చెలరేగిపోతున్న పేకాటరాయుళ్లు











