`ఒక లైలా కోసం” సినిమా ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది. అవసరమైన చోట గ్లామర్ డోస్ కూడా కాస్త పెంచి నటించడం కూడా పూజ పరిశ్రమ దృష్టిలో పడటానికి మరో కారణమని పరిశ్రమలో చెప్పుకుంటుంటారు. అల్లు అర్జున సరసన “దువ్వాడ జగన్నాథం, ఆలా వైకుంఠపురం” చిత్రాల్లోను, జూ.ఎన్ఠీఆర్ సరసన “అరవింద సమేత ” లోను, మహేష్ బాబుకు జోడీగా “మహర్షి;;లోను నటించిన ఆమెకు ప్రభాస్ సరసన “రాధేశ్యామ్” చిత్రంలో నటించే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది.
ఇంకోవైపు అఖిల్ సరసన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ ” లో నటిస్తోంది. మరోవైపు తన కెరీర్ మొదటి దశ నుంచి బాలీవుడ్ చిత్రాలు చేస్తూ వస్తున్న ఆమె తెలుగు చిత్రాలను బ్యాలెన్స్ చేస్తూ రెండు సినీరంగాల్లోనూ మెరుస్తోంది. బాలీవుడ్లో తాజాగా రణవీర్ సింగ్ కు జోడీగా “సర్కస్” అనే చిత్రంలో నటిస్తోంది. టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించిన చిత్రాలన్నీ పెద్ద హిట్ కావడం పూజకు ఎంతో కలిసొచ్చింది. ఆ క్రమంలోనే ప్రభాస్ పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రం “రాధేశ్యామ్ ” చిత్రంలో కూడా నటించే అవకాశం ఆమెను వరించడానికి కారణమైంది.
తాను బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ, తెలుగులో మంచి ఆఫర్లు ఎప్పుడు వచ్చినా వదులుకునే ప్రసక్తే లేదని పూజ ఎప్పుడూ చెబుతుంటుంది. పూజకు ఎలాంటి ప్లస్ పాయింట్లు ఉన్నప్పటికీ ఆమె నటించిన సినిమాలు పెద్ద విజయం సాధించడం కూడా సినీరంగంలో సెంటిమెంట్ అయ్యిందని కూడా పరిశ్రమలో అంటున్నారు. ప్రస్తుతం “రాధేశ్యామ్” చిత్రీకరణలో ప్రభాస్ తో కలసి పాల్గొంటూ ఆమె బిజీ బిజీగా వుంది. ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రాలన్నీ తనకు మరింత పేరు తెచ్చిపెట్టేవేనని పూజ చాలా ధీమాగా చెబుతోంది.
Must Read ;- గ్లామర్+గ్రామర్=నివేదాథామస్
Also Read ;- ‘x’ పోజింగులో ‘మోస్ట్ ఎలిజిబుల్’ పూజ