ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తానే స్వయంగా పడవకు తెడ్డు వేస్తూ నివర్ తుఫాను గ్రామాలలో పర్యటించారు. భారీ వర్షాల కారణంగా గ్రామాల మధ్యలో రోడ్డు మార్గంలో ప్రయాణించే అవకాశం లేకపోవడంతో అధికారులు మంత్రి పర్యటనకు పడవను ఏర్పాటు చేశారు. దీంతో పడవలోకి ఎక్కిన మంత్రి తానే స్వయంగా పడవను తెడ్డు వేసి నెడుతూ ముందుకు తీసుకెళ్లారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నీట ముమిగిన ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో మంత్రి పర్యటించారు.
సంగం మండలంలోని వీర్లగుడిపాడు గ్రామంలో పరిస్థితిని మంత్రి మేకపాటి సమీక్షించారు.
నిండా మునిగిన గ్రామాన్ని చూసి చలించిపోయిన ఆయనతో చిన్న వానకే మునిగిపోయే గ్రామానికి పెద్ద వరద ఇబ్బంది పెట్టిందని గ్రామస్తులు వాపోయారు. వర్షాలు వచ్చినప్పుడన్నా సురక్షిత ప్రాంతాలకు రావాలి కదా , ప్రమాదం జరిగితే ఎలా అని మంత్రి మేకపాటి వారితో అన్నారు.
తాతల కాలం నుంచి వానలు, వరదలు మాకు మామూలే సారూ అంటూ వీర్లగుడిపాడు గ్రామస్తులు మంత్రికి బదులిచ్చారు.
Must Read ;- సంక్షేమం, సంక్షోభం, కేసులే ప్రధాన ఎజెండా అంశాలు