నందమూరి నటసింహం బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో రూపొందిన సింహ, లెజెండ్ చిత్రాలు బాక్సాపీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ గా నిలవడం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేస్తున్న తాజా చిత్రం ‘అఖండ’. ఈ సినిమా పై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు ఈమధ్య రిలీజ్ చేసిన అఖండ టీజర్ కు అనూహ్యమైన స్పందన రావడం.. యూట్యూబ్ ను షేక్ చేసి రికార్డు వ్యూస్ రావడంతో ఈ సినిమా పై అంచనాలు రోజురోజుకూ అధికమౌతున్నాయి.
ఈ సినిమాని మే 28న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా మూవీ వాయిదా పడింది. త్వరలోనే తిరిగి బాలెన్స్ షూటింగ్ ను పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్లో అఖండ సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. అన్ని ఏరియాల నుంచి బిజినెస్ ఆఫర్స్ సాలిడ్ గానే వస్తున్నాయి.
రీసెంట్ గా ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ క్రింద 1.35 కోట్ల సొంతం చేసుకున్నట్టు తెలిసింది. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా సాలిడ్ రేటు కి అమ్ముడయినట్లు సమాచారం. నార్త్ ఆడియన్స్ కి బోయపాటి సినిమాలు అంటే స్పెషల్ ఇంట్రెస్ట్, జయ జానకి నాయక, సరైనోడు సినిమాలు హిందీ లో ఓ రేంజ్ లో రికార్డులు అదరగొట్టేశాయి. ఇప్పుడు బాలయ్య అఖండ సినిమాకి ఉన్న ఈ క్రేజ్ కారణంగా హిందీ డబ్బింగ్ రైట్స్ ఏకంగా 15 కోట్లు అమ్ముడయినట్లు సమాచారం.
ఇది నిజంగానే మెంటల్ మాస్ అని చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు బాలయ్య అటు బోయపాటి వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ వీళ్ళ కాంబినేషన్ పై ఉన్న సాలిడ్ క్రేజ్ కూడా ఈ రేంజ్ బిజినెస్ కి మరో కారణం అయ్యి ఉండొచ్చు. విడుదలకు ముందే అఖండ అదరగొట్టేస్తుంది. ఇక సినిమా రిలీజ్ అయితే.. బాక్సాఫీస్ దగ్గర అఖండ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.
Must Read ;- బాలయ్య అఖండ వినాయక చవితికి రాబోతుందా..?