నందమూరి నటసింహం బాలకృష్ణ – ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం అఖండ. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా కావడంతో అఖండ సినిమా పై అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. ఇటీవల రిలీజ్ అయిన అఖండ టీజర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ సాధించడంతో అఖండ సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పచ్చు. ఈ మూవీ రిలీజ్ విషయానికి వస్తే.. మే 28న అఖండ సినిమాను భారీ స్ధాయిలో విడుదల చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా సెకండ్ వేవ్ కారణం కుదరలేదు.
ఈ మూవీ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేయడంతో త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసి మిగిలిన షూటింగ్ ను కంప్లీట్ చేయడానికి టీమ్ ప్లాన్ చేస్తున్నారు. రెండు నెలల్లో ఈ షూటింగ్ పూర్తి చేయనున్నారని తెలిసింది. అయితే.. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను దసరాకి విడుదల చేయనున్నారు అని వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు అఖండ విడుదల గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఈ సినిమాను దసరాకి కాకుండా వినాయక చవితి సందర్భంగా విడుదల చేయాలి అనుకుంటున్నారట.
ఈ లెక్కన అఖండ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. మరి.. త్వరలోనే అఖండ విడుదల తేదీని అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.
Must Read ;- బాలయ్య అఖండ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టిన శ్రీకాంత్.