తిరుపతి ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి కె.విజయానంద్ అక్కడి అధికారులను ఆదేశించారు. పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు, ఆందోళనలు చేస్తుండటంతో ఆయన సీరియస్ అయ్యారు. టీవీల్లోనూ, సోషల్ మీడియాలోను వస్తున్న వార్తలపై ఆయన చిత్తూరు, నెల్లూరు కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దొంగ ఓట్లు వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుపతిలో వైసీపీ వాళ్లు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఉదయం నుంచి ఆందోళనలు చేస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో మాట్లాడిన టీడీపీ ఎంపీలు
మరో వైపు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడారు. తిరుపతి ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. వాటికి సంబంధించిన వీడియోలను ఎంపీలు అధికారులకు అందించారు.
Must Read ;- అప్రజాస్వామికంగా తిరుపతి ఎన్నికల నిర్వహణ: చంద్రబాబు










