ముందు సంస్కరిస్తున్నామన్నారు. ఆ తర్వాత ఉద్ధరిస్తున్నామన్నారు. ఇప్పుడేం చేస్తున్నారో అర్ధమవుతోందా? దొంగల పేరు చెప్పి గజదొంగలు దోచుకుంటున్నట్లే ఉంది ఇసుక యవ్వారం. తెలుగుదేశం హయాంలో ఇసుకను అక్రమంగా దోచుకున్నారంటూ నానా యాగీ చేసి.. దానిని ఆపటానికని అధికారంలోకి రాగానే ఇసుక రవాణాను ఆపేసి.. వేలాది మంది పొట్టను కొట్టిన వైసీపీ ప్రభుత్వం, అధినేత జగన్మోహన్రెడ్డి.. ఆ తర్వాత ఇసుకను ఎలా దోచుకుంటున్నారో చూస్తూనే ఉన్నారు జనం. దీనికి ఎవరి సాక్ష్యం అక్కర్లేదు. ఇసుక అవసరమైన ప్రతి మనిషికి అర్ధమైన నగ్నసత్యం ఇది.
ప్రాంతాల వారీగా బలమున్న నేతల ఆక్రమణ
ఆ దోపిడీ చివరకు ఎంతవరకు వెళ్లిందంటే ప్రాంతాల వారీగా బలమున్న నేతలు ఆక్రమించుకుని మరీ ఇసుకను అమ్ముకునేదాకా. ఎవరి ఏరియాలో వాళ్లదే రాజ్యం అన్నట్లు అయిపోయింది. అధినేత జగన్ మాట సైతం లెక్క చేయని పరిస్థితి కూడా వచ్చింది. పైకి ఓకె బాస్ అని.. కింద మాత్రం తమ సంపాదన తమదే అన్నట్లు రెచ్చిపోయారు. అందుకే జగన్మోహన్రెడ్డి దీనికి మొత్తం రాష్ట్రానికి సింగిల్ కాంట్రాక్టర్ అనే కాన్సెప్ట్‌తో చెక్ పెట్టాలని డిసైడ్ అయి.. ఆ పద్ధతి తీసుకొచ్చాడు.
జేపీ సంస్థలోనూ రాంకీలోనూ ఒకరే డైరెక్టర్
ఇప్పుడు ఆ కంపెనీ ఎవరిదో చెప్పనక్కర్లేదు. జేపీ అనే ఆ సంస్థలోనూ రాంకీలోనూ ఒకరే డైరెక్టర్. ఈ విషయం టీడీపీ పట్టాభి గొంతు చించుకుని అరుస్తున్నారు. ఆ రాంకీ ఎవరిదో తెలుసుగా.. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సోదరుడు అయోధ్య రామిరెడ్డిది.. పైగా పార్టీ రాజ్యసభ ఎంపీ. జేపీ అనేది కూడా ఒక ముసుగు మాత్రమే. ఆ ముసుగులో జగన్మోహన్రెడ్డి బ్యాచే స్వయంగా ఇసుకను ఇక ఇష్టమొచ్చినట్లు అమ్ముకుంటారు. అదే ఇప్పుడు జరగబోయేది.
ఆధారాలను బయటపెట్టినా..
అంత క్లియర్‌గా టీడీపీ ఆధారాలను బయటపెడితే.. అధికారి ద్వివేది కతలు చెబుతున్నారు. అసలు ప్రశ్నలకు సమాదానం ఇవ్వకుండా ఏవో చెప్పేస్తున్నారు. పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్ ను ప్రభుత్వం ఇచ్చింది. అందులో కౌంటర్ ఇవ్వబోయు.. మరింత చిక్కుల్లో పడినట్లు తెలుస్తూనే ఉంది. కాంట్రాక్టు తీసుకున్న కంపెనీకి అర్హత లేదంటే… బిడ్డింగ్ నిర్వహించిన సంస్థ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అంటూ దానిపై వివరణ ఇస్తారు. నష్టాల్లో ఉన్న కంపెనీకి ఇచ్చారని అంటే.. ఆ కంపెనీ టర్నోవర్ రూ.120 కోట్లంటారు. జనానికి టర్నోవర్‌కి లాభనష్టాలకు తేడా తెలియదని వారనుకుంటున్నారు పాపం.
ఉచితంగా ఇవ్వటమే విరుగుడు అనుకుని..
చంద్రబాబునాయుడు అంతటివాడే.. రకరకాల పిల్లిమొగ్గలు వేసి చివరికి ఉచితంగా ఇవ్వటమే అన్నిటికి విరుగుడు అని డిసైడ్ చేసి అమలు చేశారు. కాని దానిని తీసేసి.. ఇప్పుడు జనం దగ్గర డబ్బులు పిండేసి.. ఇటు ప్రభుత్వానికి చెందిన సహజ వనరులను ఇష్టమొచ్చినట్లు దోచేసి… ధనధాహం తీస్చుకోవడానికే తప్ప మరోటి కాదు. ఏదో సామెత ఉంది.. ఇసుక నుంచి కూడా నూనె పిండుతారని.. మన జగన్ మాత్రం ఇసుక నుంచి కూడా డబ్బులు పిండుతూ.. ఆ సామెతను నిజం చేస్తున్నాడు.
Must Read ;- ఇసుక సరఫరా కాంట్రాక్ట్‌లో క్విడ్ ప్రోకోనా.. జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ