తిరిపతి ఉప ఎన్నికలో పొలిటికల్ గేమ్ మొదలైంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్ధిని ప్రకటించింది. వైయస్సార్ పార్టీ డాక్టర్ గురుమూర్తిని ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అధికారక ప్రకటన రానప్పటికీ గురుమూర్తికే అధిక అవకాశాలు ఉన్నాయి. ఇక బీజేపి, జనసేనలు తిరుపతి బరిలో ఎవరు నిలుస్తారనేది స్పష్టత రాలేదు. ఆ రెండు పార్టీలు దాగుతు మూతలు ఆడడానికే సరిపోతుంది. ఢిల్లీ రేంజ్‌లో లాబీయింగ్ మొదలెట్టారు పవన్ కళ్యాణ్. అది చూసిన అభిమానులు జనసేన తిరిపతిలో నిలవడం ఖాయమంటూ ప్రచారాలు మొదలెట్టారు. కానీ, ఇటీవల బీజేపీ పార్టీ నాయకుల వ్యాఖ్యలు చూస్తుంటే.. అంతా గందరగోళంగా ఉంది.
గెలుపు ఆవశ్యకం
అన్ని పార్టీలతో పోలిస్తే, తిరుపతి ఉప ఎన్నిక విషయంలో స్పష్టంగా ప్రకటన విడుదలు చేసింది ఒక్క తెలుగుదేశం పార్టీ అనే చెప్పాలి. అంతేకాదు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నిక కావడంతో ఇందులో గెలిచి ప్రజల వ్యతిరేకతను ప్రభుత్వానికి చాటి చెప్పాలని ప్రతిపక్షం ప్రయత్నిస్తుంది. అంతేకాదు, పార్టీ పరంగా కూడా ఈ గెలుపు తెలుగుదేశంకి ఆవస్యకం కావడంతో అధిష్టానం ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకుని కృషి చేయాల్సిందిగా పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
Must Read ;- తిరుపతిలో ‘దుబ్బాక’ రిపీట్ అయితే.. వైసీపీ, టీడీపీలకు ముచ్చెమటలే
ఫీల్డ్‌లోకి దిగిన ప్రతిపక్షం
గెలుపే లక్ష్యమని అధిష్టానం భావిస్తుండడంతో నాయకుల్ని అప్రమత్తం చేసి ఫీల్డ్ వర్క్ మొదలెట్టాల్సిందిగా నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, రాజధాని అనిశ్చితి, చంద్రబాబు హయాంలో తిరుపతిలో జరిగిన అభివృద్థి గురించి వసృత్తంగా ప్రచారం చేయాల్సిందిగా కార్యకర్తలకు సమాయత్తం చేయమని నాయకులకు ఆదేశాలిచ్చినట్టు తెలుస్తుంది.
సమన్వయ కమిటీ ఏర్పాటు
చంద్రబాబు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలియజేశారు. ఈ కమీటి ఏర్పాటులో భాగంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, రవిచంద్ర, ఉగ్ర నరసింహా రెడ్డి, నరసింహా యాదవ్, పనబాక కృష్ణయ్యలు సభ్యలుగా వ్యవహరించనున్నట్లు టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. ఈ సభ్యులకు బాధ్యతులు అప్పగించి, కార్యకర్తలను సమన్వయపరిచేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలియజేశారు. ప్రచార నిర్వహణ, ఏ అంశాలపై గురిపెట్టాలి, వాటినెలా ప్రచారణలో భాగం చేయాలనే వాటిపై కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకుంటారని అచ్చెన్నాయడు తెలియపరిచారు.
Also Read ;- తెలంగాణ ఫలితాలు.. ఏపీ విపక్షాలకు ఆశాకిరణాలు!