ఒక్క ఛాన్స్ అంటూ గద్దెనెక్కిన జగన్ పాలన వెయ్యి రోజులు పూర్తి చేసుకుంది. విన్నపాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ మూడేళ్ళలో చేసింది ఏమిటి ? జగన్ సర్కార్ పై ప్రజల్లో వస్తున్న స్పందన ఏమిటి ? వెయ్యి రోజుల పాలనతో జగన్ గ్రాఫ్ ఎలా ఉంది ?
ఒక్క అవకాశం అంటూ తన పాదయాత్ర ఆధ్యంతం ఊరూవాడా విన్నపాలు చేసుకుంటూ అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి పాలనకు వెయ్యి రోజులు పూర్తి అయ్యింది.అభివృద్ధి, సంక్షేమం, ప్రజా రంజక పాలన అందించడం వంటి ఎన్నో హామీలు గుప్పించి జగన్ గద్దెనెక్కారు. అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పాలన మాత్రం చెప్పింది ఒకటి చేస్తున్నది మరొకటిగానే కనిపిస్తోంది.
ప్రజా వేధిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ పాలన విధ్వంసాలు, దాడులు, హత్యలు, అత్యాచారాలు, తప్పుడు నిర్ణయాలు, రద్దుచేసిన సంక్షేమ పథకాలు, ప్రజలపై మోయలేని భారాలతో కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటిపడగా పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. ఒకవైపయి దేవాలయాలపై దాడులు జరుగుతుంటే, మరోవైపు స్వయంగా పుణ్యక్షేత్రాలలోనే అన్యమత ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి.
ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్షాల పై కక్ష సాధింపు, ప్రశ్నించే గొంతుకలను పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమ అరెస్టులు చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే వారిని వేధింపులకు గురిచేయడం జగన్ సర్కార్ కు పరిపాటిగా మారాయి. రాజ్యాంగ అధికారాలను కాలరాయడం, వ్యవస్థలపై దాడి చేయడం, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయడం వైసీపీ నియంతృత్వ పాలనకు నిలువుటద్దంగా నిలుస్తున్నాయి.
మద్యం రూపంలో సొంత ఖజానా నింపుకోవడం, అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఇసుక , మట్టి మాఫియాగా తయారవ్వడం, ముప్పై లక్షల ఇళ్ళు ఇస్తామంటూ మభ్యపెట్టడం, స్థలాలకు భూముల కొనుగోలు పేరిట భారీ కుంభకోణానికి తెరలేపడం వైకాపా పాలనలో చోటుచేసుకున్న అవినీతి గుళికలు. సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించడం, ప్రజలకు ఉపయోగపడుతున్న అన్న క్యాంటీన్లు, కల్యాణ లక్ష్మి, పండుగ కానుకలు, నిరుద్యోగ భృతి సహా అనేక పథకాలు ఎత్తివేయడం, 150 సార్లకి పైగా కోర్టులో ప్రభుత్వం భంగపాటు పడడం జగన్ ప్రభుత్వ అనుభవ లేమి, అవగాహన రాహిత్యానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారి వాడుక భాష, చట్ట సభల్లో బూతుల పురాణం వారి దిగజారుడుతనాన్ని స్పష్టీకరిస్తుండగా , సామాన్యుల్లో చట్ట సభలపై అసహ్యాన్ని కలిగిస్తున్నాయి.
మొత్తం మీద జగన్ వెయ్యి రోజుల పాలన ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడం , ప్రజలకు ప్రజా ప్రతినిధులకు సంభామధాలు తెంచేయడం, పగ ప్రతీకారాలకు చిహ్నంగా మారి జగన్ లో అధికార దర్పాన్ని పెంచింది తప్పితే రాష్ట్రానికి ఎక్కడా మేలు జరిగిన పరిస్థితి మాత్రం లేదని చెప్పక తప్పదు.
Must Read:-జగన్ పరిపాలన చెత్తగా ఉంది | Public Shocking Comments YS Jagan Schemes | Leo News