తమిళ కమెడియన్ వివేక్ కన్నుమూశారు. గుండె పోటుతో ఆయన ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న24 గంటల వ్యవధిలోనే ఆయన కన్నుమూయడం చర్చనీయాంశమైంది. ఆయనకు గుండెపోటు రావడంతో చెన్నైలోని సిమ్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. గురువారం నాడు ఆయన మొదటి విడత కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వివేక్ వయసు 59 సంవత్సరాలు.ఆయన ఆరోగ్యంపై ఏ విషయం చెప్పలేమని వైద్యులు నిన్ననే ప్రకటించారు.
ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందించింది. ఆయన మరణ వార్త తెలియగానే తమిళ చిత్ర పరిశ్రమ షాక్ కు గురైంది. తమిళ నటులు మహేంద్రన్, వడివేలు తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న నటుడిగా వివేక్ ను చెప్పాలి. దాదాపు 250 చిత్రాల్లో ఆయన నటించారు. 2009లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
ఆయన నటించిన అనేక తమిళ చిత్రాలు తెలుగులోకి కూడా అనువాదమవడంతో తెలుగువారికి కూడా వివేక్ సుపరిచితులు. ఈ మధ్య ఆయన సినిమాలు కూడా తగ్గించారు. నిన్న కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వివేక్ కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న కొద్ది గంటల వ్యవధిలోనే హార్ట్ అటాక్ రావడం, మరణించడంతో అందరూ విస్తుపోతున్నారు.
Must Read ;- కరోనా కోరల్లో చిత్ర పరిశ్రమ విలవిల