‘‘గతంలో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తారా అని అడిగారు.. ఇప్పుడు మేం చేస్తాం. మీకు ఆ దమ్ము ఉందా.?’ టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ !
‘‘సీఎం జగన్ గానీ, ఆయన కుటుంబ సభ్యులుగానీ వైఎస్ వివేకాను హత్య చేయలేదని వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయగలరా’’ నారా లోకేశ్ చాలెంజ్!!
జగన్ ను టార్గెట్ చేస్తూ..
గత నాలుగైదురోజులుగా తిరుపతి ఉప ఎన్నిక ప్రచారాన్ని నిశితంగా పరిశీలిస్తే ఓటర్లను ఆకట్టుకోవడంలో టీడీపీ ముందంజలో ఉంది. ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంలో సై సై అంటున్నారు. టీడీపీ గెలుపు కోసం బాబు తిరుపతిలో తిష్ట వేసి సమావేశాల మీద సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాలకు కేటాయించిన ప్రచార కమిటీతో నిత్యం మీటింగ్ నిర్వహిస్తున్నారు. కార్యకర్తలను, నాయకులను అలెర్ట్ చేస్తూ గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. గెలుపు కోసం ఏయే అంశాలపై ఫోకస్ చేయాలో పార్టీ నేతలకు వివరించి చెప్తున్నాడు. ముఖ్యంగా ప్రచారంలో చంద్రబాబు ప్రత్యేక హోదాను తెరపైకి తెచ్చాడు. ప్రత్యేక హోదా కోసం తాము ఎంతవరకైనా పోరాడుతామని, మీరు పోరాడగలరా అంటూ వైసీపీని ఇరకాటంలో నెట్టెస్తున్నాడు.
ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ..
తిరుపతి టీడీపీ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియ ముగియగానే రంగంలోకి దిగాడు లోకేశ్. ఇంటింటా తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకుంటూ టీడీపీ కి ఓటు వేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో వివరించి చెప్తున్నాడు. తాను ముమ్ముర ప్రచారం చేస్తూనే, టీడీపీ యువ నాయకులను రంగంలోకి దింపారు. కేసినేని నాని, శ్వేత లాంటి యువకులను ప్రచార బాధ్యతలను ఇచ్చి, ఓట్లు రాబట్టేలా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ వివేకానంద హత్య కేసు గురించి ప్రస్తావిస్తూ… వివేకాను ఎవరో హత్య చేశారో… తెలుపలంటూ సవాల్ విసరుతుండటంతో వైసీపీ నాయకులు తిరిగి జవాబు చెప్పలేని పరిస్థితులు కల్పించాడు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ టీడీపీకి మద్దతు లభించేలా ప్రచారం చేస్తున్నాడు. ఏదేమైనా తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో తండ్రికొడుకులు సై అంటే సై అంటూ గెలుపు కోసం కష్టపడుతున్నారు.
Must Read ;- వైసీపీకి ఓటెందుకు వెయ్యొద్దో బాబు, లోకేశ్ చెప్పేశారు











