విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఎట్టకేలకు స్పందించారు. రోజుకు వంద టన్నుల ఆక్సిజన్ అందిస్తూ లక్షలాది మంది ప్రాణాలు కాపాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలనుకోవడం ఎంత వరకు సబబని ఆయన ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే ఇలాంటి సమయంలో లక్షలాది కరోనా రోగులకు ఆక్సిజన్ అందేదా అని చిరంజీవి ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని కేంద్రానికి సూచించారు.
ఎట్టకేలకు స్పందించారు..
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై తెలుగు సినీ ప్రముఖులు నోరు మెదపడం లేదంటూ వచ్చిన విమర్శలకు తెరపడింది. విశాఖ స్టీల్ పరిశ్రమ ప్రైవేటీకరణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండగా, ఆయన అన్న చిరంజీవి మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై చిరంజీవి వ్యూహాత్మకంగా మాట్లాడినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటనలు ఇచ్చినా ఎక్కడా ప్రభుత్వానికి నొప్పి లేకుండా చెప్పాలని చూశారని తెలుస్తోంది.
Must Read ;- బలిపీఠంపై ఉన్నా.. ప్రాణ దాతగా నిలిచిన విశాఖ ఉక్కు
Let us THINK.. #VizagSteelPlant #OxygenForIndia pic.twitter.com/6MjSKp7jVB
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 22, 2021