సమంత అక్కినేని హోస్ట్ గా ‘ఆహా’ నిర్వహిస్తున్న సామ్ జామ్ కార్యక్రమం ఓ మహిళా ఆటో డ్రైవర్ జీవితంలో మార్పు తెచ్చింది. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కే పరిమితం కాకుండా సామాజిక ప్రయోజనం కలిగించడానికి కూడా ‘ఆహా’ దోహదపడింది. ఈ షోలో టాలీవుడ్‌కి చెందిన అగ్ర నటులు పాల్గొనడమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో పలువురి జీవితాల్లో మంచి మార్పులకు నాంది పలికారు. ఈ సామ్‌జామ్ ద్వారా నారాయణ్ ఖేడ్‌కు చెందిన కవితా రాథోడ్ జీవితం కూడా మారిపోయింది.
కవితా రాథోడ్ విషయానికి వస్తే చిన్నతనంలోనే ఆమె తల్లిని పొగొట్టుకుంది. కకుటుంబ బరువు బాధ్యతల మీద పడ్డాయి. ఉపాధి కోసం హైదరాబాద్ లో అడుగుపెట్టి అంకుల్ సాయంతో ఆటో నడపటం నేర్చుకుంది. జీవన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు తప్పలేదు. కుటుంబ పోషణ కోసం మగాడిలా మారకతప్పలేదు. తన తోడబుట్టినవారికి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేయాలని అనుకుంది. కానీ కొవిడ్ ఆమె లక్ష్యానికి బ్రేకులు వేసింది. ప్రత్యామ్నాయంగా తన కుటుంబానికి రక్షణగా ఓ హోటల్ ప్రారంభించాలని తన సొంతూరుకు వచ్చేసింది.
కవిత ఎదుర్కొన్న ఒడుదొడుకులు ‘ఆహా’దృష్టికి వచ్చాయి.
దాంతో సామ్ జామ్ షోకు అతిథిగా ఆహ్వానించింది. ఇక్కడికి వచ్చిన కవితను తమన్నా సమక్షంలో సమంత సన్మానించారు. జీవనం కోసం కవిత చేస్తున్న పోరాటం చూసి స్ఫూర్తి పొందిన సమంత ఓ కారును బహుమతిగా అందిస్తామని ప్రకటించారు. అంతేకాదు వెంటనే కవితను కారును అందించే ఏర్పాటు చేశారు. ఆ కారు కవిత జీవితంలో మార్పు తెచ్చింది. కవిత ఇప్పుడు ఓ కారుకు యజమాని మాత్రమే కాదు కొన్ని నెలల్లోనే ఆ కారును ఈ బిజీ రోడ్లపై ఎలా నడపాలో కూడా నేర్చుకుంది. ఏకకాలంలో కారు, ఆటో డ్రైవింగ్‌ను బ్యాలెన్స్ చేయగలనని ఆమె భావిస్తోంది. తనకు ఇలా సాయపడ్డ ఆహాకి, సమంతకూ, సామ్ జామ్ షో నిర్వాహకులకు కవిత కృతజ్ఞతలు తెలిపింది. తన జీవితం ఇలా మారిపోతుందని ఊహించలేదంది.
Must Read ;- ‘ఆర్.ఎక్స్ 100’ దర్శకుడితో అక్కినేని వారి ‘ఏజెంట్’ ?











