దేశంలో చంద్రబాబు గ్రాఫ్ అంతకంతకూ పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే దేశంలోనే అత్యుత్తుమ ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబు టాప్ – 3లో నిలిచారు. మూడ్ ఆఫ్ ది నేషన్, ఇండియాలోనే బెస్ట్ చీఫ్ మినిస్టర్ పేరుతో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే సర్వే నిర్వహించింది. జనం మెచ్చిన ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబు మూడో స్థానంలో నిలిచారు.
గతేడాది ఆగస్టులో నిర్వహించిన సర్వేలో ఐదో స్థానంలో నిలిచిన చంద్రబాబు..ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి నాలుగో స్థానానికి ఎగబాకారు. తాజాగా నిర్వహించిన సర్వేలో మూడో స్థానానికి వచ్చారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఫస్ట్ మొదటి స్థానంలో ఉండగా..బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రెండో స్థానంలో ఉన్నారు.
కూటమి ప్రభుత్వం హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతుండడంతో సీఎం చంద్రబాబుపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతోంది. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇప్పటికే 5 హామీలను ప్రభుత్వం అమలు చేసింది. పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఫ్రీ బస్సు, తల్లికి వందనం లాంటి పథకాలు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చాయి. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ..ఒక్కో పథకాన్ని చంద్రబాబు పట్టాలెక్కిస్తున్న తీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారు చంద్రబాబు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నారు. గడిచిన ఏడాదిన్నర కాలంలోనే వేలాది కోట్ల రూపాయలు ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు బడా సంస్థలు ముందుకు వచ్చాయి.స్వయంగా చంద్రబాబే ముందుండి కంపెనీలను ఏపీకి ఆహ్వానిస్తున్నారు. అమరావతికి పునర్‌వైభవం తీసుకువచ్చారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు సైతం పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నారు. కూటమి ఏడాది పాలనతో జాతీయంగా, అంతర్జాతీయంగా రాష్ట్రానికి పరపతి పెరిగింది. ఏడాదిన్నర కాలంలో ఎలాంటి వివాదాలు లేకుండా పాలన సాఫీగా సాగుతోంది. దీంతో చంద్రబాబుకు అంతకంతకూ మద్దతు పెరుగుతోంది. ఇదే విషయం ఇండియా టుడే సర్వేలో స్పష్టమైంది











