ఎపీ సీఎం అభ్యర్థి పవన్ కల్యాణ్ అంటూ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ విజయసాయి రెడ్డి తనదైన స్టైల్లో స్పందించారు. సీఎం సీటు ఆఫర్ చేస్తున్న వారికి ఏపీలో ఒక్క సీటు కూడా లేదని, దాన్ని తీసుకునే వారికి ఉనికే లేదని ఆయన ట్వీట్ చేశారు. తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికని, ఈ సందర్భంగా సీఎం అభ్యర్థి పలానా అనడం బిస్కెట్ వేయడం గాక ఇంకేమిటని ఆయన పేర్కొన్నారు.
Must Read ;- పవనే తమ సీఎం అభ్యర్థి.. సోము మాటలతో జన సైనికులు ఖుష్
జరుగుతున్నది తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక. కాబోయే సీఎం ఫలానా అంటూ బిస్కట్ వేయడం కాక మరేమిటి? ఆఫర్ చేసే పార్టీకి రాష్ట్రంలో ఒక్క సీటు లేదు. దానిని తీసుకునే పార్టీకి ఉనికి లేదు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట. కనీసం ఎమ్మెల్యే కూడా కాని వాడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కుతాడట!
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 31, 2021