శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చతికిలపడ్డ అధికారం!
ప్రజల మమకారం.. వైసీపీకి అధికారాన్ని కట్టబెట్టింది. ఇప్పుడు అదే.. ఆ పార్టీ నాయకులకు అహకారాన్ని తెచ్చిపెట్టింది. ఆ అహకారమే సొంతగూటిలో హయాన్ని రెచ్చగొట్టింది. రెచ్చగొట్టిన హయం రాజుకుంది. ఆ మంటలు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వ్యాపించాయి. అంతిమంగా అధికారపార్టీలోని నేతలను దహించి వేస్తున్నాయి. ఇంకా పార్టీ అధికారంలో రెండేళ్లు ఉంది కదా.. సర్దుకుపోదామన్న ఫేవర్ ను కూడా మరిచి.. ఎమ్మెల్యేలపై సొంతపార్టీ నేతలే దుమ్మెత్తిపోస్తున్నారు. మీడియా సమావేశాలు పెట్టిమరి ఎమ్మెల్యేలను తిట్టిపోస్తున్నారు. అధిష్టానం కలగజేసుకోకుంటే.. మూకుమ్మబడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక కార్యకర్తలైతే ఒక అడుగు ముందుకేసి మరి.. అధికారపార్టీని వీడి.. తెలుగు దేశం, జనసేన, బీజేపీల్లోకి వలస కూడా వెళ్లిపోతున్నారు. ఆ మధ్య విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావుపై సొంత పార్టీ నేతలే ఒక రేంజ్ రెచ్చిపోయారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రోడ్డుపై బయటాయించి నిరసన వ్యక్తం చేశారు వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు. ఎమ్మెల్యే బాబురావు వసూల్ రాజా అంటూ పేరు పెట్టి మరి తిట్టిపోశారు. ఇటీవల చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్, కృష్ణా జిల్లా కైకలూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు, శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే, మంత్రి సీదిరి అప్పరాజు, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఎచ్చెర్ల గొర్లె కిరణ్ కుమార్, గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే వరప్రసాదురాజు ఇలా చెప్పుకుంటూపోతే.. లిస్ట్ చేంతాడును మించిపోతోంది. ఈ ఎమ్మెల్యేలందరూ సొంతగూటి నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకున్న వారే! ఎమ్మెల్యేలకే కాదు, ఎంపీలకు సైతం సొంతగూటి నుంచి అసమ్మతి సెగలు తప్పడంలేదు.
గ్యాపులకు కారణం ఆధిపత్యమేనా?
పార్టీని ఆది నుంచి అంటిపెట్టుకుని వస్తున్నవారిని అధికార వైసీపీ ఎమ్మెల్యేలు ఓవర్ లుక్ చేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. అందుకే వైసీపీ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తిరుబాటు బావుట ఎగరవేశారు. వైసీపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ముందుకు సాగుతున్నారు. మా మండలాల్లో ఆ వైసీపీ ఎమ్మెల్యేలను తిరగనివ్వమని తెగసి చెబుతున్నారు. ఇలా శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకు వైసీపీలో ఆదిపత్యపోరు ప్రజాప్రతినిధులకు, నాయకులు గ్యాప్ ను పెంచుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల గొర్లె కిరణ్ కుమార్ పై వైసీపీ సీనియర్ నేతలే తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు మండాల్లోని సీనియర్ మీడియా సమావేశం పెట్టి మరి ఎమ్మెల్యే గొర్లె కిరణ్ పై విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో అధికార వైసీపీ చతికిలపడి అసమ్మతి జ్వాలల్లో మగ్గుతోంది!మరోవైపు ప్రజల నుంచి కూడా పార్టీ తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుంటుంది!!
Must Read :-వైసీపీని గెలింపించి పెద్ద తప్పు చేశా.. తన చెప్పుతోనే తానే కొట్టుకున్న మాజీ మంత్రి!