తెలంగాణలో రేపటి నుంచి అంటే జూన్ 20 వరకు మరో పది రోజులు లాక్ డౌన్ పొడిగించారు. అయితే సడలింపు సమయాన్ని నాలుగు గంటలు పొడిగించారు.ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలించారు. సాయంత్రం 5 గంటల నుంచి గంటపాటు అంటే 6 గటంల వరకు ఇళ్ళకు చేరేందుకు వెసులుబాటు కల్పించారు. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కఠినంగా లాక్‌డౌన్ అమలు చేయనున్నారు.కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లా మధిర, సత్తుపల్లి, నకిరేకల్ మినహా మిగతా నల్లగొండ జిల్లాలో ఇవే అమలుతాయి.తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు మిగతా ప్రాంతాల్లో ఇవే లాక్ డౌన్ నిబంధనలు అమలవుతాయి.
Must Read ;- దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు : రోజువారీ కేసులు 86 వేలకు!











