కామెడీలోని అన్నికోణాల్లోనూ చెలరేగి.. వాటిలోతుల్ని చూసేసిన కామెడీ కింగ్ బ్రహ్మానందం. ఇంతవరకూ ఆయన పోషించని నవ్వుల పాత్రేలేదు. జంధ్యాల, ఇవివి, యస్వీకృష్ణా రెడ్డి లాంటి దర్శకులు.. కేవలం ఆయనకోసమే ప్రత్యేకమైన పాత్రలు క్రియేట్ చేసి మరీ ఆయన హాస్యాన్ని ప్రేక్షకులకు పంచేవారు. అలాంటి బ్రహ్మీ .. కొంతకాలంగా సినిమాలు తగ్గించేశారు. తనకి సరిపడే కామెడీ పాత్ర ఉంటేనే బ్రహ్మానందం సినిమాల్లో నటిస్తున్నారు.
లేటెస్ట్ గా వచ్చిన ‘జాతిరత్నాలు’ మూవీ లో జడ్జ్ గా నవ్వులు పూయించారు. అలాగే.. త్వరలో రాబోతున్న కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ‘రంగమార్తాండ’ లోనూ ఆయనో సర్ ప్రైజింగ్ కేరక్టర్ చేయబోతున్నట్టు సమాచారం. ఇక ఇప్పుడు బ్రహ్మీ మరో ల్యాండ్ మార్క్ కేరక్టర్ కోసం రంగంలోకి దిగుతున్నారట. అది కూడా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిర్మిస్తున్న ‘పెళ్ళిసందడి’ సీక్వెల్ మూవీలో. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన చేయబోతున్న పాత్ర బిల్డప్ బాబాయ్.
జబర్దస్త్ లో గెటప్ శీను పండించిన బిల్డప్ బాబాయ్ పాత్ర ఏ రేంజ్ లో పేలిందో తెలిసిందే. ఒక ప్రత్యేకమైన వాయిస్ లో ‘నమ్మవేంట్రా బాబూ..’ అంటూ శీను పంచులు నవ్వులు పంచుతాయి. ఇప్పుడు అదే పాత్రను బ్రహ్మీ కోసం డిజైన్ చేయించారట రాఘవేంద్రరావు. నిజానికి బ్రహ్మీ గతంలో ఇలా బిల్డప్ ఇచ్చే పాత్రను రామ్ గోపాల్ వర్మ అనగనగా ఒక రోజులో మైకేల్ జాక్సన్ అనే పాత్రతో పలికించి నవ్వులు పంచాడు. నెల్లూరి పెద్దారెడ్డి తెలుసా? అంటూ పోలీస్ స్టేషన్ లో ఆయన చేసే హడావిడి అంతా ఇంతా కాదు. చాలా సీరియస్ గా ఈ పాత్రను పండించి.. అదరగొట్టారు. మరి ‘పెళ్ళిసందడి’లో బ్రహ్మీ.. గెటప్ శీను ను మించి నవ్వులు పూయిస్తారేమో చూడాలి.
Must Read : బిల్డప్ బాబాయ్ గా బ్రహ్మానందం.. ఇంతకీ ఏ సినిమా?