దక్షిణాది కేరక్టర్ ఆర్టిస్టుల్లో ప్రస్తుతం చాలా బిజీగా ఉన్న నటుడు జగపతి బాబు అనే చెప్పాలి. కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా.. కన్నడ, మలయాళ, తమిళ చిత్రాల్లో సైతం తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకొన్న విలక్షణ నటుడు ఆయన. బాలయ్య ‘లెజెండ్’ మూవీ నుంచి మొదలు పెట్టిన ఈ జెర్నీని జగ్గూభాయ్ .. ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే తన కెరీర్ లో ఇప్పటివరకూ చాలా సంతృప్తినిచ్చిన విలన్ పాత్ర మాత్రం ఖచ్చితంగా ‘అరవింద సమేత’ లోని బసరెడ్డే అని చెబుతారు ఆయన.
తన పగ ప్రతీకారం కోసం కన్నకొడుకునే బలిచ్చిన బసిరెడ్డి లాంటి క్రూయల్ కేరక్టర్ ను, భయం గొలిపే ఆ మేకోవర్ ను జగపతి బాబు అంతకు ముందెన్నడూ చేయలేదు. అయితే ఇప్పుడు దాన్ని బీట్ చేసే మరో ఈవిల్ కేరక్టర్ ను జగపతి బాబు ఓ తమిళ సినిమా కోసం చేయబోతుండడం విశేషాన్ని సంతరించుకుంది. అయితే ఆ సినిమాలో హీరో ఆషామాషీ కాదు మరి. సూపర్ స్టార్ రజనీకాంత్. ఆ సినిమా అన్నాత్తే.
శివ దర్శకత్వంలో పక్కా మాస్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో జగ్గూభాయ్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరిదశలో ఉంది. ఈ విషయాన్ని జగపతి బాబు తన ఇన్ స్టా ఖాతాలో తెలియచేస్తూ.. అన్నాత్తే లో బసిరెడ్డి ని బీట్ చేసే మరో ఈవిల్ కేరక్టర్ చేస్తున్నానని, దాని కోసమే తాను రెడీ అవుతున్నానని తెలుపుతూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Must Read : ప్రభాస్ ‘సలార్’ జోరు మామూలుగా లేదు











