పథకం ప్రకారం హత్యకు కుట్రలు
వివేకా హత్యకేసు విచారణ తుదిదశకు చేరుకుంది. సీబీఐ దీనిపై అన్ని సాక్ష్యాధారాలను సేకరించి, నిందుతులను అరెస్ట్ చేసి, రిమాండ్ కు పంపింది. హత్యకేసులో ముద్ధాయిలుగా ఉన్న వారు కడప సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ నేపధ్యంలో కేసులో ఉన్న ముద్దాయిలను హత్య చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం ఆరోపించారు. మొద్దు శ్రీను హత్య జరిగినప్పుడు అనంతపురం జైలర్ గా ఉన్న వరణ్ రెడ్డిని.. ఇప్పుడు కడప జైలర్ గా నియమించారని తెలిపారు. దీనిపై సీబీఐకి లేఖ రాస్తామని, కడప జైల్లో ఉన్న వివేకా హత్య కేసు నిందుతులకు ప్రాణహానీ ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
మూడేళ్లు కావస్తున్న కొలిక్కిరాని కేసు..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్హ జగన్ మోన్ రెడ్డి కి స్వయానా పినతండ్రి అయిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగి మూడేళ్లు కావస్తోంది. మార్చి 15, 2019లో అత్యత దారుణంగా హత్యకు గురైన వివేకా కేసు నేటికి మిస్టరీగానే మిగిలిఉంది. ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి పాలన పగ్గాలు తీసుకుని 32 నెలలు కావస్తున్న ఈ హత్య కేసు చిక్కుమూడి వీడటంలేదు. వివేకా హత్య కేసులో కీలక నిందుతుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సన్నితుడు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుని కోర్టు హాజరుపర్చగా.. ప్రస్తుతం కడప సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే సీబీఐ పులివెందుల కోర్టులో రెండో ప్రాథమిక చార్జిషీటును దాఖలు చేసిన విషయం విదితమే!
Must Read:-జగన్ నిర్ణయాలు.. మత్స్యకారులకు శాపాలు!