ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి గౌతమ్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయ్యింది. ఆయన ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కరోనా లక్షణాలు బయటపడటంతో ఆయన టెస్టులు చేయించుకున్నారు. దీంతో కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన అన్నారు. గత వారం రోజుల్లో తనను కలిసిన వారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని గౌతమ్‌రెడ్డి విజ్ఙప్తి చేశారు. ఐటీ పరిశ్రమల మంత్రి గౌతమ్‌రెడ్డికి కరోనా సోకడంతో మైక్రోసాఫ్ట్ ఐటీ కంపెనీలో నైపుణ్యాభివృద్దిపై జరగాల్సిన కార్యక్రమం వాయిదా పడింది.
వెలవెల పోతున్న సచివాలయం
వెలగపూడి సచివాలయంలో కరోనాతో పది రోజుల్లోనే నలుగురు ఉద్యోగులు చనిపోవడంతో కార్యాలయానికి వచ్చేందుకు ఉద్యోగులు జంకుతున్నారు. వెలగపూడి సచివాలయానికి ఉద్యోగులు, సందర్శకులు రాక వెలవెలపోతోంది. చాలా మంది ఉద్యోగులు ఇప్పటికీ హైదరాబాద్ నుంచి వస్తూ వెళుతూ ఉండటంతో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే సచివాలయంలో వంద మందికిపైగా ఉద్యోగులు కరోనా భారినపడ్డారు. మంత్రులు అసలు సచివాలయం వైపు కూడా రావడం లేదు.
Must Read ;- కేటీఆర్ కు కరోనా : తండ్రిని కలిసిన మరుసటి రోజే!











