ఏపీ సచివాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.. ఇద్దరు పిల్లలతో కలసి వచ్చిన దంపతులు ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఎదుట పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో.. ఆ ప్రాంతంలోని పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ దంపతులను అదుపులోకి తీసుకుని విచారించారు. నెల్లూరు జిల్లా దత్తలూరు ఎమ్మార్వో చంద్రశేఖర్ అనే వ్యక్తి తమను మోసం చేశాడని వారు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. పొలం ఆన్ లైన్ చేస్తానని నమ్మించి తమ నుంచి కోటి రూపాయలు వసూలు చేసినట్లుగా దంపతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Must Read ;- వైసీపీ నేతల బెదిరింపులకు సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్య