కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశ ప్రజలు ఇంకా పూర్తిగా కోలుకోక ముందే డెల్టాప్లస్ కేసులు పెరుగుతున్నాయి. కరనా సెకండ్ వేవ్‌లో భారత దేశంలో అత్యధిక మరణాలకు కారణమైన డెల్టా వేరియంట్ డెల్టాప్లస్‌గా రూపాంతరం చెందింది. దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. కరోనా థర్డ్ వేవ్‌కు ఈ వేరియంట్ కారణమవుతుందన్న అంచనాలున్నాయి.
దేశంలో 48 డెల్టా ప్లస్ కేసులు
యూకే, అమెరికా తర్వాత ఇండియాలోను ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది. ధేశంలో ఇప్పటి వరకు 48 డెల్టా ప్లస్ కేసులు గుర్తించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 20, తమిళనాడులో 9,మధ్యప్రదేశ్‌లో 7, కేరళలో 3, పంజాబ్ , గుజరాత్ రాష్ట్రాల్లో రెండేసి కేసులు గుర్తించారు. ఇంకా ఏపీ, బడిశా, రాజస్థాన్, జమ్ముకాశ్మీర్ , కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. కాగా ఈ కేసుల సంఖ్యను బట్టి పెరుగుతున్న దోరణి చెప్ప లేమని నేసనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ సుజిత్ సింగ్ తెలిపారు.
50 శాతంపైగా డెల్టా వేరియంట్
కరోనా సెకండ్ వేవ్‌లో ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని పాజిటివ్ కేసుల్లో 50 శాతానికి పైగా డెల్టా వేరియంట్ ఉందని, దీని ద్వారానే డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదవుతున్నట్లు అంచనాలున్నాయి. ఇప్పటికే దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ కేసులు నమోదయిన రాష్ట్రాలకు లేఖ రాశారు.ఈ కేసులున్న ప్రాంతాల్లో కంటైన్మెంట్, కాంటాక్ట్ ట్రేసింగ్ వంటి చర్యలు పటిష్టంగా చేపట్టాలని సూచించారు.
ఈ వేరియంట్‌లో వైరస్ సంక్రమణ వేగంగా ఉండటం, ఊపిరితిత్తుల్లోని కణాలతో బంధం ఏర్పరుచుకోవడం, మోనోక్లోనల్ యాంటీబాడీస్ థెరఫీకి రెసిస్టెన్స్ వంటి లక్షణాలున్నట్లు గుర్తించారు.
Must Read ;- రూపు మార్చుకుంటూ.. ఎందరినో బలి తీసుకుంటూ











