అడ్డంకులను అధిగమిస్తూ .. అప్రతిహాత మద్దతుతో సాగుతున్న పాదయాత్ర:
‘న్యాయంస్థానం టూ దేవస్థానం’ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన రైతులకు అనుమతులివ్వకుండా ఆదిలోనే తొక్కాలని చూసింది జగన్ ప్రభుత్వం. కానీ తొక్కితే బంతిమాదిరిగా లేచి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది రైతు జేఏసీ. రైతులకు అనుమతులివ్వడానికి ససేమీరా అన్న డీజీపీకి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అల్లర్లు జరిగి లాం అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చిలక జోష్యం చెప్పిన డీజీపీకి అక్షింతలు కూడా వేసింది కోర్టు. రైతులకు షరుతులతో కూడిన అనుమతులనిస్తూ అదేశాలను జారీ చేసింది. దీంతో రైతు పాదయాత్ర తుళ్లూరు నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రకు ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలతోపాటు, తెలంగాణ రైతులు కూడా మద్దతు తెలిపారు. గుంటూరు జిల్లాలో పాదయాత్ర ను ముగించుకొని ప్రకాశం జిల్లాలోకి అలా ఎంటర్ కాగానే పోలీసులు హైడ్రామాకు తెరలేపారు. పర్చూరు నియోజకవర్గంలో పాదయాత్రను అడ్డుకోవాడానికి రైతులపై కేసులు నమోదు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పాదయాత్ర నిర్వహాకులకు నోటీసులిచ్చారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ హక్కులను కాలరాయాలని చూస్తే ..ధర్మం, న్యాయం చూస్తూ ఊరుకోదు అన్నట్లు అప్రతిహాతంగా మద్దతు తెలుపుతూ నీరాజనాలు పలికారు. పాదయాత్రను కుట్రపూర్వకంగా అడ్డుకోవాలని చూస్తే .. సహించేది లేదని అన్ని రాజకీయ పార్టీ, వామపక్షాలు మండిపడ్డాయి.
దమ్ముంటే రైతుల పాదయాత్ర అడ్డుకో .. జైళ్లును నింపుతాం ..
కుట్రలు, కుతంత్రాలను పురికొల్పి రైతు పాదయాత్రను అధికారపార్టీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. ప్రకాశంలో జిల్లాలో పాదయాత్రకు సాయంగా వస్తున్న కళాకారుల వాహనాన్ని స్వాధీనం చేసుకోని, రైతులకు నోటీసులు అందించారు పోలీసులు. ఇదిలా ఉంటే మరోపక్క రైతుల పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. అన్ని వర్గాల వారు పాదయాత్రకు సంఘీభావం తెలిపి, తమవంతుగా పాదయాత్రలో పాల్గొని రైతులతోపాటు స్వచ్ఛందంగా కలిసి నడుస్తున్నారు. రాజధాని కాపాడుకోవాలని రైతులు చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తే సహించబోమని తెలుగు దేశం పార్టీ, జగసేన, కాంగ్రెస్, సీపీఐ,సీపీఎం, రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో పోలీసులు ప్లే చేసిన హైడ్రామాను సీపీఐ నారాయణ ఖండించారు. జగన్ రెడ్డికి దమ్ముంటే పాదయాత్రను అడ్డుకోని చూడాలని సవాలు విసిరారు. అంతేకాదు రైతులను చిత్రహింసలకు గురిచేసినా, పాదయాత్రలో అల్లర్లు సృష్టించినా.. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇప్పటికైన ప్రభుత్వానికి కనువిప్పు కలిగి అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. రైతులపై చేయి వేస్తే నిరసనల తీవ్రత ఏంటో ముఖ్యమంత్రికి చూపుతామని ధ్వజమెత్తారు. జైల్ భరో కూడా పిలుపినిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘టచ్ చేసి చూడు జైళ్లు నింపకపోతే ఒట్టు’ అన్న సందేహాన్ని నారాయణ నేరుగా అధికారపార్టీకి తగిలేలా వ్యాఖ్యానించారు.
Must Read ;- మహాపాదయాత్రపై భౌతిక దాడికి ‘స్కెచ్’











