మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎప్పడూ లేనంతగా రసవత్తరంగా జరుగుతున్నాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు నువ్వా.? నేనా..? అన్నట్టుగా పోటీపడుతున్నారు. పొలిటికల్ ఎలక్షన్స్ ను తలపించేలా మా ఎన్నికల ప్రచారం జరుగుతుండడంతో సామాన్యులు సైతం ఈ ఉత్కంఠ పోరులో ఎవరు గెలుస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లోకల్, నాన్ లోకల్ మధ్య పోటీ అని ప్రచారం జరిగింది.
ఆతర్వాత ప్రకాష్ రాజ్ కి చిరంజీవి సపోర్ట్ చేస్తున్నారని నాగబాబు ప్రకటించడంతో ఇది చిరు వెర్సెస్ మోహన్ బాబు మధ్య పోటీగా వార్తల్లోకెక్కింది. ఆతర్వాత బిజేపీని సపోర్ట్ చేసేవాళ్లు.. బిజేపీని వ్యతిరేకించే వాళ్ల మధ్య పోటీగా మారింది. కారణం ఏంటంటే.. ప్రకాష్ రాజ్ బీజేపీకి వ్యతిరేకం. ఇది అందరికీ తెలిసిందే. మంచు విష్ణుకు బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే బిజీపీ నాయకులు అయిన బాబు మోహన్ తో పాటు మరి కొందరు మంచు విష్ణు ప్యానల్ లో ఉన్నారు.
అందుచేత ఈవిధంగా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే.. మంచు విష్ణు తన గెలుపు పై ధీమాగా ఉన్నారు. మీ నమ్మకం ఏంటని విష్ణుని అడిగితే.. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఉంటుందని… చాలా మంది తన వ్యతిరేక ప్యానెల్, అపొజిషన్ కాంపౌండ్ లో ఉన్నప్పటికీ.. ఆ ఓట్లు కూడా తనకే పడతాయని చెబుతున్నాడు విష్ణు. చాలా మంది నాతో నిజాయితీగా మాట్లాడారు. వృత్తిపరంగా వేరే కాంపౌండ్ లో ఉండాల్సి వచ్చింది కానీ.. ఓటుు మాత్రం ఖచ్చితంగా నీకే వేస్తాం అన్నారు. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగబోతోంది. పూర్తిగా నాకు అనుకూలంగా ఉండబోతోంది అనేది విష్ణు నమ్మకం. మరి.. విష్ణు నమ్మకం నిజం అవుతుందో లేదో చూడాలి.
Must Read ;- మా అధ్యక్ష బరిలో సివిఎల్.. మేనిఫెస్టో విడుదల











