మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఊహించని పరిణామాలతో రాజకీయం వేడెక్కుతుంది.
ఎత్తుకు పై ఎత్తులతో ప్రచారంలో స్పీడు పెంచి దూసుకెళుతున్నారు. అయితే.. మంచు విష్ణు ప్యానల్ పై ప్రకాష్ రాజ్ ఎన్నికల అధికారికి పిర్యాదు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే. ఇంతకీ ఏం జరిగిందంటే… మా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉంది. 60 ఏళ్లు నిండిన వాళ్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయచ్చు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో 60 ఏళ్లు నిండిన వాళ్లు 125 మంది ఉన్నారు. అందులో 60 మంది పోస్టల్ బ్యాలెట్స్ ను తీసుకుని వాళ్ల దగ్గరకు వెళ్లి ఓట్లు వేయించారని.. ఇదంతా మంచు విష్ణు ప్యానల్ కి చెందిన చిన్నా అనే వ్యక్తి చేశారని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్నారు. ఆ అరవై మందికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి కట్టాల్సిన అమౌంట్ ను కూడా ఒక వ్యక్తే కట్టారని అంటున్నారు. తన ప్యానల్ సభ్యులతో కలిసి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన అనంతరం ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ… ఏజెంట్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ కుట్ర చేస్తున్నారు.
విష్ణు తరఫున ఓ వ్యక్తి 60 మంది సభ్యుల తరఫున 28 వేలు కట్టారు. ఆయన కడితే ఇక్కడ ఎలా తీసుకున్నారు? అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. కృష్ణ, కృష్ణంరాజు, శారద, పరుచూరి బ్రదర్స్, శరత్‌బాబు తదితరుల పోస్టల్ బ్యాలెట్ డబ్బులు కూడా మంచు విష్ణు తరఫు వ్యక్తే కట్టారు. ఎన్నికల్లో గెలవడం కోసం ఇంత దిగజారుతారా? ఈ విషయం పై పెద్దలు కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున సమాధానం చెప్పాలి అని ప్రకాశ్‌రాజ్ డిమాండ్ చేశారు. ఊహించని ఈ పరిణామాలతో మా రాజకీయం మరింత వేడెక్కింది.
Must Read ;- కృష్ణ, బాలకృష్ణ మద్దతు మాకేనంటున్న విష్ణు











