టిడ్కో ఇళ్లపై అసెంబ్లీలో చేపట్టిన స్వల్పకాలిక చర్చ తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. స్వల్పకాలిక చర్చపై మంత్రులు సుదీర్ఘంగా మాట్లాడుతూ ప్రతిపక్ష సభ్యులకు అవకాశం ఇవ్వకపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పీకర్ పై సీరియస్ అయ్యారు. టీడీపీ అధినేత స్పీకర్ ను నీ అంతు చూస్తామని అనడంపై క్షమాపణ చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కోరారు.
స్పీకర్ తీవ్ర ఆగ్రహం
ప్రతిపక్ష సభ్యులపై స్పీకర్ తమ్మినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్నే అంతుచూస్తామంటారా? ఇక్కడ ఎవరూ బెదిరేవారు లేరని స్పీకర్ హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యులు సభలో నినాదాలు చేశారు. టిడ్కో ఇళ్లపై చర్చ చేపట్టి, దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకు 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని వైసీపీ సభ్యుల భజనతో టీడీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్లపై చర్చను పక్కదారి పట్టిస్తున్నారి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు నిరసన తెలిపారు.
Also Read: అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల వాకౌట్