హీరోయిజాన్ని తెరపై భారీ ఎత్తున ఎలివేట్ చేయడంలోనూ, హీరోలకు హైఓల్టేజ్ ఇమేజ్ తెచ్చిపెట్టడంలోనూ బోయపాటి శీను మాస్టర్. ప్రస్తుతం ఈ దర్శకుడు నటసింహ బాలకృష్ణ తో అఖండ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన టీజర్ .. ఇప్పటికీ ఇంకా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తునే ఉంది. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా .. మే 28న సినిమా విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడినట్టు సమాచారం.
సింహ, లెజెండ్ మూవీస్ బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో ‘అఖండ’ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి హై యాక్టేన్ మూవీ తర్వాత బోయపాటి ఏ సినిమా చేస్తాడు, ఎవరితో చేస్తాడు అనే విషయంలో అందరూ ఆసక్తిగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం బోయపాటి నెక్ట్స్ చేయబోయేది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తోనట. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్ లో ‘సరైనోడు’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా… బన్నీ కెరీర్ లోనే ప్రత్యేకమైందిగా నిలిచిపోయింది.
‘సరైనోడు’ సినిమా విడుదలై.. ఇప్పటికి ఐదేళ్ళు అయిపోయింది. ఈ సందర్భంగా ఇటీవల ఈ సినిమాను తలుచుకున్నాడు బన్నీ. ‘సరైనోడు’ సినిమా తనకెరీర్ లోనే చాలా ప్రత్యేకమైందని, తనకి ఇలాంటి సినిమా ఇచ్చినందుకు బోయపాటి శ్రీను కు ధన్యవాదాలు అంటూ.. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేశాడు కూడా. ఈ నేపథ్యంలో బోయపాటి తో మరో అదిరిపోయే యాక్షన్ సినిమా చేయడానికి బన్నీ రెడీ అయ్యాడని సమాచారం. బన్నీ కోసం మరో ఫుల్ యాక్షన్ స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నాడట బోయపాటి. యాక్షన్ తో పాటు బన్నీ స్టైలాఫ్ ఎంటర్ టైనింగ్ కూడా ఉండబోతోందట. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని టాక్. మరి ఈసారి బోయపాటి బన్నీతో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.
Must Read ;- ‘అఖండ’ టీజర్ తో చరిత్ర తిరగరాసిన బాలయ్య











