‘గంగోత్రి’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. తొలి ప్రయత్నం యావరేజ్ రిజల్ట్ రాబట్టినప్పటికీ.. రెండో సినిమా ‘ఆర్య’ అల్లు అర్జున్ కు టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్టైంది . ఆ ఒక్క సినిమాతోనూ బన్నీ ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అంతేకాదు.. అదే సినిమా మలయాళంలోకి డబ్బింగ్ అయి.. అక్కడ కూడా సూపర్ హిట్టై.. మన అల్లు అర్జున్ కాస్తా అక్కడ మల్లూ అర్జున్ గా మారాడు. బన్నీకి అక్కడ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆ తర్వాత వచ్చిన ‘బన్నీ’ సినిమాతో అల్లు అర్జున్ స్టైల్ స్టార్ అయ్యాడు.

18 ఏళ్ళల్లోనూ దాదాపు 20 సినిమాల్లో నటించి బన్నీ.. టాలీవుడ్ లో క్రేజీ స్టార్ హీరోగా ఎదిగాడు. చిరంజీవి తర్వాత టాలీవుడ్ లో ఆ స్థాయిలో డ్యాన్స్ చేసే హీరోగా బన్నీ పేరు తెచ్చుకున్నాడు. ప్రతీ సినిమాలోనూ కష్టసాధ్యమైన , వైవిధ్యమైన ఓ డ్యాన్స్ మూమెంట్ చేసి మాస్ అభిమానుల గుండెల్లో మంచి స్థానం సంపాదించాడు బన్నీ. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ.. ఆ ప్రభావం తనమీద పడకుండా.. తనకు తాను ఇండివిడ్యువల్ గా హీరోగా ఎదగాలని తపించిన అల్లు అర్జున్.. ఎన్నో సూపర్ హిట్ మూవీస్ తో క్రేజీ స్టార్ హీరో గా ఎదిగి.. ఇప్పుడు టాలీవుడ్ లో హైయస్ట్ పెయిడెడ్ హీరోల లిస్ట్ లో చోటు సంపాదించుకున్నాడు.
లాస్టియర్ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న బన్నీ.. ఈ ఏడాది ఆగస్ట్ లో ‘పుష్ప’ సినిమాతో మరోసారి కొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ మూడో సినిమాగా విశేషాన్ని సంతరించుకున్న పుష్ప ‘బన్నీ’ ఇమేజ్ ను ఎన్నో రెట్లు పెంచుతుందని అంచనా వేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైతం విడుదల కాబోతన్న పుష్ప సినిమా టీజర్ నిన్ననే విడుదలైంది. బన్నీ ఊరమాస్ గెటప్ తో అభిమానులకు పూనకాలు తెప్పించాడు. లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా ఎర్రచందనం స్మగ్లర్ గా.. అద్భుతమైన మేకోవర్ తో మతిపోగొట్టాడు.
ఈ సినిమాతో బన్నీకి ఐకాన్ స్టార్ అనే సరికొత్త బిరుదును ఇచ్చాడు దర్శకుడు సుకుమార్. నిన్న బన్నీ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన పుష్ప టీజర్ .. రికార్డు స్థాయిలో వ్యూస్ అందుకొని యూ ట్యూబ్ లో సంచనాలు క్రియేట్ చేస్తోంది. నిన్న విడుదలైన స్పెషల్ టీజర్ లోనే .. స్టైలిష్ స్టార్ బన్నీ.. ఐకాన్ స్టార్ గా మారాడు. మరి ఈ ఐకాన్ స్టార్ బిరుదును నిలబెట్టుకోడానికి బన్నీ ఇంకెంతగా కష్టపడతాడో చూడాలి.
ALSO READ:నిన్న స్టైలిష్ స్టార్ – నేడు మెగాస్టార్, మెగా పవర్ స్టార్











