మెగాస్టార్ చిరంజీవి – బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆచార్య. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండడంతో ఈ క్రేజీ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థ పై రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. త్వరలోనే కాజల్ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ కానుంది.
Must Read ;- నిహారిక పెళ్ళి వేడుకల్లో ప్రత్యేకార్షణగా నిలిచిన చిరు
ఇదిలా ఉంటే.. ఏ ముహుర్తాన ఈ సినిమాని స్టార్ట్ చేసారో కానీ.. అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. కొరటాల శివ.. మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా చేసిన తర్వాత చిరంజీవితో సినిమా చేయాలి అనుకున్నారు. ఆ టైమ్ లో చిరంజీవి సైరా నరసింహారెడ్డి మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అప్పటి నుంచి ఆయన డేట్స్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. చిరు సైరా కంప్లీట్ చేసుకుని ఆచార్య షూటింగ్ స్టార్ట్ చేస్తే.. ఇప్పటి వరకు ఏదో రకంగా అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. కరోనా కారణంగా చాన్నళ్లు ఆగిన ఆచార్య షూటింగ్ నవంబర్ లో తాజా షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.
రీసెంట్ గా చిరంజీవి ఆచార్య షూటింగ్ లో జాయిన్ అయ్యారు. అయితే.. మెగా డాటర్ నిహారిక పెళ్లి సందర్భంగా షూటింగ్ బ్రేక్ ఇచ్చారు. మళ్లీ డిసెంబర్ 12 నుంచి ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారని సమాచారం. ఏప్రిల్ నెలాఖరుకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలనేది కొరటాల ప్లాన్. ఎట్టి పరిస్థితుల్లోను ఈ చిత్రాన్ని మే నెలలో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. చిరంజీవి కూడా సాధ్యమైనంత త్వరగా ఆచార్య షూటింగ్ పూర్తి చేసి వేదాళం రీమేక్ ప్రారంభించాలి అనుకుంటున్నారు.
మెహర్ రమేష్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి చిరు ఎప్పుడంటే అప్పుడు వేదాళం రీమేక్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. చిరంజీవి.. చరణ్ సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసారు. అయితే.. ఇందులో చరణ్ పాత్ర దాదాపు అరగంట సేపు ఉండడం.. తండ్రీకొడుకులు చిరు, చరణ్ ల పై వచ్చే సన్నివేశాలు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయని వార్తలు రావడంతో అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను ఆచార్య పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి.. బాక్సాఫీస్ వద్ద ఆచార్య ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
Also Read ;- మెగా డాటర్ నిహారిక వివాహానికి 120 మంది అతిధులు