మెగాస్టార్ చిరంజీవి , కొరటాల కలయికలో ప్రస్తుతం సెట్స్ మీదున్న మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా ఆచార్య. దేవాలయ భూముల కుంభకోణం నేపథ్యంలో సాగే ఈ సినిమా తమిళనాడులోని ధర్మస్థలి లో వాస్తవంగా జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలేంటో తెలియదు కానీ.. ఈ మూవీ మాత్రం దేవాదాయ శాఖలోని అవినీతిపై కొరటాల సంధిస్తోన్న అస్త్రం అని అర్ధమవుతోంది. ఈ ఏడాది సమ్మర్ లోకానీ, దసరా కానుకగా గానీ విడుదల కానున్న ‘ఆచార్య’ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం అభిమానుల్ని ఫుల్ ఖుషీ చేస్తోంది.
అదేంటంటే.. ఆచార్య సినిమాకి సంబంధించిన ఓ భారీ దేవాలయం సెట్ ను హైద్రాబాద్ లో నిర్మించారు. ఇండియాలోనే అతి పెద్ద టెంపుల్ టౌన్ సెట్ ఇది. 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ సెట్ వేశారు. ఇందులో ప్రతీ చిన్ని డిటైల్స్ ను ఆశ్చర్యం గొలిపే రీతిలో మలిచారు. పురాతన దేవాలయంగా సినిమాలో రివీల్ కానున్న ఈ సెట్ సినిమాకే హైలైట్ కానుంది.
ఇక ఈ దేవాలయం సెట్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కళ్ళు చెదిరే రీతిలో రివీలైన ఈ సెట్ కు సంబంధించిన వీడియో చిరంజీవి వాయిస్ తో ఉంది. ఈ వీడియో ఫ్యాన్స్ ను అలరిస్తోంది. ఈ టెంపుల్ సెట్ సినిమాలో మంచి ఆనందా నుభూతినిస్తుందని చిరంజీవి చెబుతున్నారు. ఈ సందర్భంగా చిరు దర్శక ,నిర్మాతల్ని, కళా దర్శకుడ్ని అభినందించారు. ఈ వీడియో ను చిరంజీవి తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేశారు. మరి ఈ సినిమాకి దేవాలయం సెట్ ఏ రేంజ్ లో హైలైట్ అవుతుందో చూడాలి.
Must Read ;- మెగాస్టార్ చిరంజీవి‘వేదాళం’ మే నుంచి సెట్స్ పైకి
The amazing #TempleTown set built for #Acharya is a real piece of Art. Couldn't stop sharing it with you all. pic.twitter.com/P4psg5TDVn
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 6, 2021