మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవితో ఉన్న ఆ నలుగురు ఇంకెవరో కాదు.. ఒకరు కొరటాల శివ, ఇంకొకరు మోహన్ రాజా, మరొకరు మెహర్ రమేష్, చివరిగా బాబి. ఫొటోల్లో వరుస క్రమం ఏదైనా సినిమాల పరంగా ఇదే కావచ్చేమో. ఇంతకీ చిరంజీవి ఏ ఫొటో షేర్ చేయడంలో అంతరార్థం ఏమిటో ఇంకా అర్థం కాలేదా?.. ఏముంది రాబోయే కాలంలో వీరి దర్శకత్వంలోనే చిరంజీవి సినిమాలు రావచ్చు. వీరి సినిమాలు అయ్యాకే మిగతావారి సినిమాలు ప్రారంభమవుతాయేమో. నా నలుగురు కెప్టెన్లు ఈ నలుగురు అని మెగాస్టార్ కామెంట్ చేశారు.
ఆల్రెడీ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక మోహన్ రాజాతో సినిమా ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇక మెహర్ రమేష్ తో ‘వేదాళం’ రీమేక్ ప్రపోజల్ ఉండనే ఉంది. బాబీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ‘లూసీఫర్’ రీమేక్ ను బాబి చేయనున్నారన్న ప్రచారం కూడా సాగింది. తీరా ఆ ప్రాజెక్టు మోహన్ రాజా చేతుల్లోకి పోయింది. దానికి బదులుగా బాబి చెప్పిన మరో కథకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడీ ఫొటో షేర్ చేయడం ద్వారా చిరంజీవి అధికారికంగా ధ్రువీకరించినట్టు అయ్యింది.
Must Read ;- మెగాస్టార్ మూవీలో.. బిగ్ బాస్ విన్నర్ అభిజిత్
My 4 Captains Ee naluguru
Funtastic 4 Char kadam@sivakoratala @jayam_mohanraja @MeherRamesh @dirbobby pic.twitter.com/sn3AaGsAFR— Chiranjeevi Konidela (@KChiruTweets) January 22, 2021











