బెయిల్ కోసం ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది.బెయిల్ కోసం సెషన్స్ కోర్టుకు వెళ్లాలని ఆయనకు ఉన్నత న్యాయస్థానం సూచించింది.సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఎంపీ రఘురామరాజు నిన్న రాత్రి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై జరిగిన వాదనల్లో రఘురామరాజు అరెస్టుకు సహేతుక కారణాలు లేవని ఆయన తరఫున న్యాయవాది ఆదినారాయణరావు కోర్టుకు వివరించారు. జిల్లా కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించగా, కేసు తీవ్రత దృష్ట్యా హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.ఎంపీ రఘురామరాజును నిన్న సీఐడీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసి గుంటూరుకు తరలించిన విషయం తెలిసిందే.
Must Read ;- జగన్‌రెడ్డి ఓ పిచ్చివాడు : ఎంపీ రఘురామరాజు ఘాటు వ్యాఖ్యలు










