అక్టోబర్ 15 భారత ప్రజల అత్యంత ప్రియమైన రాష్ట్రపతిగా పిలుచుకున్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతి. ఆయన 1931లో తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. ఆయన 89వ జయంతి రోజున ఆయనను మరోసారి స్మరించుకుందాం.
ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను స్మరిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. ‘భారత దేశం కలాం లాంటి వ్యక్తి ని కలిగి ఉండటం అనేది ఎంతో గొప్ప విషయం. అలాంటి గొప్ప వ్యక్తి జీవిత చరిత్ర ఈ రోజు కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిదాయకం. విద్యార్థులంటే ఆయనకు ఎంతో ఇష్టం. విద్యార్థులంతా ఆయన చూపిన మార్గాన్ని సుగమం చేసుకుంటు ముందుకు సాగాలని కోరుకుంటున్నానంటూ’ ట్విట్ చేశారు. ప్రధానితో పాటు, పీయూష్ గోయల్, రవి శంకర ప్రసాద్ తో పాటు పలువురు మంత్రులు ఆయన జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ట్విట్లు చేశారు. ఆయన జయంతిని విద్యార్థి దినోత్సవం గా జరుపుకుంటున్న సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం
1952 తరువాత భారతదేశంలో ఏ సైంటిస్ట్ కూడా భారత రత్న అవార్డును అందుకోలేదు. భారత మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ తన ప్రభుత్వం పడిపోకుండ కాపాడుకుంటున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీల చేత బలహీన ప్రధాన మంత్రిగా మాటలు అనిపించుకుంటునే ఉన్నారు. ఆ తరుణంలోనే దేశ భద్రతకు తాను ఎంతటి విలువనిస్తానో నిరూపించుకోవడం కోసం మన మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాంకు భారత రత్న ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా 1998లో కలాంకు భారత రత్న ఇవ్వడం జరిగింది.
నాకు బూట్లు లేవు.. చెప్పులు మాత్రమే ఉన్నాయి
ఎస్ఎల్ వి-3 పరీక్ష సక్సెస్ తరువాత తనను కలవాల్సిందిగా ఇందిరాగాంధీ సతీశ్ ధావన్ ను పిలిచినప్పుడు సతీశ్ ధావన్ తో పాటు వచ్చిన వారిలో కలాం కూడా ఒకరు.. అయితే మొదట ఈ ఆహ్వానం వచ్చినప్పుడు కలాం భయపడిపోయారంట. నాకు బూట్లు లేవు. కేవలం చెప్పులు మాత్రమే ఉన్నాయి. ఎలా రావాలి.? అని సతీశ్ ధావన్ ను అడగగా…. ఆయన ‘మీరు ఇప్పటికే విజయాన్ని ధరించి ఉన్నారు. కాబట్టి ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా వచ్చేయమన్నారు’.
కలాం సాహెబ్ మీరు రాష్ట్రపతి కావాలి
2002 జూన్ 10న అన్నా యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ డాక్టర్ కళానిధి ఏపీజే అబ్దుల్‌కలాంకు వెంటనే ఇక్కడికి రావాలంటూ సందేశం పంపారు. వెంటనే వీసీ కార్యాలయానికి వెళ్లిన ఆయనకు కాసేపటికి ఫోన్ వచ్చింది. ప్రధాని వాజ్‌పేయి లైన్‌లోకి వచ్చి “కలాం సాహెబ్, మీరు దేశానికి రాష్ట్రపతి కావాలి” అన్నారు. కలాం వాజ్‌పేయికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఆఫర్‌ను పరిశీలించడానికి నాకు గంట సమయం కావాలని అడిగారు. “మీరు టైమ్ తీసుకోండి. కానీ మీ నుంచి అవును అనే సమాధానం రావాలి , కాదు అని కాదు” అన్నారు వాజ్‌పేయి.
సాయంత్రానికి ఎన్డీఏ కన్వీనర్ జార్జ్ ఫెర్నాండెజ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్ మహాజన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం మాయావతి సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించి కలాం అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.
ఇవేమి బట్టలండి.. తాబేలు దుస్తులు లాగా ఉన్నాయి
రాష్ర్టపతి కాకముందు వరకు కలాం సాధా దుస్తులనే ధరించేవారు. రాష్ర్టపతికి కొత్త దుస్తులు కుట్టడం కోసం రాష్ర్టపతి భవన్ దర్జీ కలాం కొలతలు కూడా తీసుకున్నారు. కొన్ని రోజుల తరువాత దర్జీ నాలుగు జతల సూట్లు తీసుకుని వచ్చారు. వాటిని ఆయన ఒకసారి వేసుకుని ఇవేమి బట్టలండి తాబేలు బట్టలులాగా ఉన్నాయి. ఊపిరి ఆడటం లేదు అని దర్జీతో అన్నారు. అంతే దర్జీ అప్పటికప్పుడు ఆయన వేసుకున్న సూట్ మెడ వద్ద కొంచెం కత్తిరించారు. అప్పటి నుంచి ఆ సూట్లకు కలాం సూట్లని పేరు వచ్చింది. సూట్ మీద టై కట్టుకోమంటే అది నా కళ్లజోడు తుడుచుకోవడానికి తప్ప దేనికి పనికి రాదు. నేను కట్టుకోను అనేవారు.
రాష్ట్రపతి భవన్ కు అద్దె చెల్లించిన కలాం
ఓసారి కలాం తన కుటుంబంలోని 52 మందిని రాష్ర్టపతి భవన్ కు ఆహ్వానించారు. వారంతా ఆ భవనంలో దాదాపు ఒక వారం రోజుల పాటు బస చేశారు. వారు వెళ్లిపోయిన తరువాత వారు ఉన్న వారం రోజులకు గానూ కలాం అద్దెను చెల్లించారు. కలాం రాష్ర్టపతిగా ఉన్న సమయంలో తన అన్న మనవుడు ఒకరు దిల్లీలోనే అద్దెకు ఉండేవారు. తనకు ఎంతో ఇష్టమైన తన అన్నని కూడా ఏ రోజు వచ్చి తనతో ఉండమని కలాం అడగలేదు.
మరోక సమయంలో తన అన్న, ఆయన కూతురు వారి కుమారుడు కలిసి హాజ్ యాత్రకు వెళ్లారు. ఆ విషయం తెలుసుకున్న అక్కడ ఉన్న అధికారులు వారికి ప్రభుత్వం తరఫున సకల సౌకర్యాలు కలిగిస్తామని కలాంను అనుమతి కోరగా.. ఆయన సున్నితంగా తిరస్కరిస్తూ.. అలాంటివి ఏమి అవసరం లేదు. వారి పని వారిని చూసుకోనివ్వండి అంటూ వారికి తెలిపారు. అంతటి నిబద్ధత కలిగిన వ్యక్తి కలాం.
జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!
నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...











