సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి హీరోగా నటించగా, నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ హీరోయిన్ గా నటించింది. నట్టి క్రాంతి నిర్మాతగా తీస్తున్న ఈ చిత్రం టీజర్ ను ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా నట్టి కుమార్ మాట్లాడుతూ, “అన్ లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత జాగ్రత్తలు తీస్తుకుంటూ ఈ చిత్రాన్ని తీశాం. ఇందుకు యూనిట్ అంతా సంపూర్ణ సహకారం అందించడం వల్లే పూర్తయింది. నిర్మాతగా అనేక చిత్రాలు నిర్మించిన నేను గతంలో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించాను. తాజాగా నా దర్శకత్వంలో నా కుమార్తె నటించడం, దీనిని నా కుమారుడు నిర్మించడం ఆనందంగా ఉంది” అని తెలిపారు.
హీరో రోషన్ సాలూరి మాట్లాడుతూ, “అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. నట్టి కరుణ తన పాత్రలో మంచి నటనను కనబరిచింది. , నటిగా ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుంది. టీజర్ బావుందని చూసినవాళ్లు అంటున్నారు” అని చెప్పారు. హీరోయిన్ నట్టి కరుణ మాట్లాడుతూ, తప్పకుండా ఇదొక మంచి చిత్రమవుతుంది”‘ అని వివరించారు. ఈ చిత్రానికి కెమెరా: కోటేశ్వర రావు, సంగీతం: ఎస్.ఏ.ఖుద్దూస్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: కెవి.రమణ.
Must Read ;- ఎవరి ప్యాకేజీకి తలొగ్గి `రాంగ్ గోపాల్ వర్మ తీయలేదు











