గంటా వెంకటేశ్వరరావు.. ప్రస్తుతం ఈ పేరు చెబితే వైసీపీ సోషల్ మీడియా ఉలిక్కి పడుతోంది.. వారిని షేక్ చేస్తోంది ఈ రెండక్షరాల పేరు.. గతంలో వైసీపీ కరపత్రిక, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మానస పుత్రిక సాక్షి మీడియాలో జీవీ విశ్లేషణలు విచ్చలవిడిగా తీసుకుంది.. నేడు ఆయనను ఓ కమెడియన్ అంటూ ఏకి పారేస్తోంది సాక్షితోపాటు వైసీపీ సోషల్ మీడియా..
గంటా వెంకటేశ్వరరావు.. ఏపీకి చెందిన ఓ ఆడిటర్.. సీఏ పూర్తి చేసిన తర్వాత పలు కంపెనీలకు ఆడిటర్ గా వ్యవహరించారు. ఆర్ధిక అంశాలపై పట్టు ఉండడంతో ఆయనను ఎనలిస్ట్ గా సాక్షి అనేక కథనాలను ప్రచురించింది. ఇటు సాక్షి టీవీ బిజినెస్ ఎనాలసిస్ లో ఆయన రెగ్యులర్ గా కనిపించే ఫేస్.. అలాంటి జీవీపై నేడు ఆ పత్రిక విషపు రాతలు చూస్తుంటే ఆయన సిగ్గు పడుతున్నారు..
రీసెంట్ గా జీవీ.. ఈనాడు మీడియాకి ఓ ఇంటర్ వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్ వ్యూలో ఆయన ఏపీ ఆర్ధిక పరిస్థితిపై కుండబద్దలు కొట్టారు. ఇప్పటికే పది లక్షల కోట్ల రూపాయల అప్పు అయిందని, పరిస్థితి ఇలానే ఉంటే.. దివాళా తీయడం ఖాయమని, మరో శ్రీలంకలా మారుతుందని విశ్లేషించారు.. ఇప్పటికే ఓడీపై నడుస్తోందని, నెలకు ఏపీ సర్కార్ చేస్తున్న అప్పులు రాష్ట్రాన్ని నిలువునా ముంచేస్తాయని గంటా వెంకటేశ్వరరావు అభిప్రాయ పడ్డారు.. ఈ ఇంటర్ వ్యూ ఎంతో వైరల్ అయింది.. ఆ ఒక్క ఇంటర్ వ్యూతో వైసీపీ ఉలిక్కి పడింది.. అసలే జగన్ ముందస్తు ఎన్నికలకు వస్తున్నారనే ప్లాన్ తో ఉన్నారు. ఇలాంటి టైమ్ లో ఏపీ ఆర్ధిక స్థితిపై జీవీ చేసిన విశ్లేషణ.. జగన్ ఇమేజ్ ని దెబ్బ కొట్టేలా ఉంది.. దీంతో, వైసీపీ తనదైన కౌంటర్ వ్యూహాన్నిరెడీ చేసింది.
ఆర్ధిక నిపుణుడు జీవీ ఇమేజ్ ని దెబ్బతీయడం.. ఆయన వ్యక్తిత్వ హననం.. ఇదే షురూ చేసింది.. ఇటీవల ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ప్రశంసించిన తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ పై సోషల్ మీడియాలో వైసీపీ ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో.. అంతకంటే ఎక్కువగానే ఎటాక్ చేసింది. జీవీపై వైసీపీ సోషల్ మీడియా చేసిన దాడిని చూసి… ముక్కున వేలేసుకుంటున్నారు.. జీవీపై భారీగా ట్రోల్స్, ఆయన పాత వీడియోలు షేర్ చేయడం, ఆయనను ఓ కమెడియన్ గా చిత్రీకరించడానికి అన్ని మార్గాలను ఎంచుకుంది..
అయితే, సాక్షితోపాటు వైసీపీ సోషల్ మీడియా పక్కా వ్యూహంతోనే ఇలా ఎటాక్ చేసిందని చెబుతున్నారు ఎనలిస్టులు. రజనీకాంత్ అయినా, జీవీ అయినా.. ఎవరయినా తమపై నెగిటివ్ గా కామెంట్ చేయడానికి భయపడేలా చేయడమే వారి వ్యూహం.. ఇకపై ఎవరూ ముందుకు రాకూడదు.. వైసీపీ అక్రమాలు, అరాచకాలపై గొంతు సవరించకూడదు.. ఎలుగెత్తి ఒక్క మాట ప్రశ్నించకూడదు.. ఈ వ్యూహంతోనే వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. అవతలి వ్యక్తుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.. తమపై విమర్శలు చేసిన వారిని ఇలా ఎటాక్ చేస్తే.. ఇతరులు తమని టార్గెట్ చేయరనే వ్యూహంతో ఉంది వైసీపీ.. మరి, దీనికి టీడీపీ సోషల్ మీడియా ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.










