ఎటువంటి రంగమైనా కావచ్చు.. ఎలాంటి అడ్డుంకులైనా ఎదురవచ్చు.. వారు తలుచుకుంటే దాసోహం అనాల్సిందే. అది అమ్మాయిల పవర్ అంటే.. అలా అన్ని రంగాల్లో అబ్బాయిల్ని మించి దూసుకుపోతున్న అమ్మాయిల దూకుడుకు వారి తల్లిదండ్రులే కళ్లెం వేస్తున్నారా? నేటి కాలంలో అవసరమైన ఆధనిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో అమ్మాయిలు వెనకబడే తల్లిదండ్రులే అడ్డుకుంటున్నారా? దానికి సమాధానం ఔననే వస్తుంది. ‘జాతీయ బాలికా దినోత్సవం’ సందర్భంగా జరిపిన ఓ సర్వేలో ఫోన్ల వినియోగంలో అమ్మాయిలు బాగా వెనకబడ్డారని చెప్తున్నారు విశ్లేషకులు.
కర్నాటక భేష్!
దేశంలో మొత్తం 11 రాష్ట్రాల్లోని 29 జిల్లాల్లో 4,100 మంది టీనేజ్ అమ్మాయిలపై ఈ సర్వే నిర్వహించింది. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా వివరాలు వెల్లడించింది. ఈ సర్వేలో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. దేశంలో టీనేజ్ అమ్మాయిలకు వారి పెద్దలు డిజిటల్ పరికరాలను అందుబాటులో ఉంచడం లేదని తేల్చింది. డిజిటల్ పరికరాల వినియోగంలో రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య తేడాలు ఉన్నాయని సర్వే తెలిపింది. దాదాపు 42 శాతం మంది అమ్మాయిలు.. రోజుకు గంట కన్నా తక్కువసేపే ఫోన్లు వినియోగిస్తున్నారని తేల్చింది. కర్ణాటకలో అత్యధికంగా 65 శాతం మంది అమ్మాయిలకు డిజిటల్ పరికరాలు అందుబాటులో ఉండగా.. హరియాణలో అత్యల్ప శాతం అమ్మాయిలే డిజిటల్ పరికరాలు వినియోగిస్తున్నారని చెప్పింది.
Must Read ;- ఫైజర్ టీకా టెక్నాలజీ ‘ఎంఆర్‌ఎన్‌ఏ’ సృష్టికర్త గురించి మీకు తెలుసా?

ఎందుకిలా?
సంప్రదాయం వైఖరి, కుటుంబ నేపథ్యం, ఆలోచనా విధానాలే ఇందకు కారణాలని తెలుస్తున్నాయి. టీనేజ్ వయసు నుంచే అమ్మాయిలు, ఫోన్లు, డిజిటల్ పరికరాలు వంటివి ఉపయోగించడం దారి తప్పుతారనే భయంతో పెద్దలు ఇలా ఆలోచిస్తున్నారని సర్వే తేలింది. అలాగే.. డిజిటల్ వినియోగం అమ్మాయిల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందనేది మరికొందరి అభిప్రాయం. వీటితోపాటు ఆర్ధిక పరమైన విషయాలు కూడా ప్రభావం చూపుతున్నాయని మరికొందురు చెప్తున్నారు. వీటిన్నంటినీ పక్కన పెడితే.. మరో దారణమైన నిజం బయటపడింది. దేశంలో 32 శాతం మంది టీనేజ్ అమ్మాయిలకు మాత్రమే ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడం తెలుసని, ఇగిలిన 68 శాతం మందికి అసలు ఫోన్లు లిఫ్ట్ చేయడం కూడా తెలియదని పేర్కొంది. డిజిటల్ పరికరాలు అందివ్వడంలో నేటికీ అబ్బయిలు, అమ్మాయిలకు మధ్య వారి పెద్దలు భేదం చూపిస్తున్నారని ఈ సర్వే స్పష్టం చేసింది.
Also Read ;- నాది ‘మార్స్’.. భూగ్రహవాసులను కాపాడడానికి వచ్చాను!
వీరి భయాలు నిజమేనా?
తల్లిదండ్రుల భయాలను తప్పుబట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాల్లో ఎక్కువగా బలవుతున్నది అమ్మాయిలనే చెప్పాలి. సోషల్ మీడియాలో పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మి వారితో వారితో వ్యక్తిగత విషయాలు, అభ్యంతరకర ఫొటోలు పంచుకోవడం ఆపై బ్లాక్ మెయిల్ లాంటివి ఎదరుకోవడం నేటి కాలంలో పరిపాటైపోయింది. పోలీసులు హెచ్చరిస్తున్నా కూడా నేటి యువత ఆన్ లైన్ మాయలో పడి విలవిల్లాడుతున్నారు. ఇలాంటి మన అమ్మాయికి ఎదురు కాకుడనే ఆలోచనే వారిలా చేసేలా చేస్తుంది. ఇక మరికొందరి విషయంలో కుటుంబ నేపథ్యం, ఆర్థిక విషయాలు ప్రభావాన్ని చూపుతున్నాయి.

Also Read ;- ఎలాన్ మస్క్ : నెం.1 గా శిఖరాగ్రంపై ఎన్నాళ్లు?
ఇది కరక్టేనా?
కరోనా వస్తుందని ఎంత కాలం ఇంట్లో ఉంటాం.. బయటకు వెళ్లి దానికి ఎదుర్కోక తప్పదు.. అనే ధోరణని నేడు ప్రపంచం అలవాటు చేసుకుంది. అదే పరిస్థితి ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఎవరి వల్లనో.. ఎప్పుడో.. ఎక్కడో.. ఇబ్బందులు వస్తాయని వారిని నేటి ఆధునిక కాలానికి దూరంగా ఏమాత్రం హర్షించతగ్గ విషయం కాదు. నేటి కాలంలో పోటీ తత్వం అవసరం.. అప్పుడే వారికంటూ ఓ గుర్తింపు సాధించగలరు. అది అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా.. వారికి డిజిటల్ పరికరాలు ఉపయోగించకుండా ఆపడానికి బదులుగా వారికి ప్రస్తుత పరిస్థితులపై అవగాహాన కల్పించాలి. ఆన్ లైన్ మోసాల గురించి తెలియజేయాలి. అప్రమత్తంగా వ్యవహరించేలా వారిని తీర్చిదిద్దాలి. అంతేకాదు.. తల్లిదండ్రులు వారి ఆన్ లైన్ వ్యవహారాలపై ఓ కన్నేసి ఉంచాలి. ఒకవేళ చదువురాని వాళ్లైతే.. మీ కుటుంబంలో చదివిన వారి సాయం తీసుకుని తెలుసుకోవాలి. ఇలా వారికి అన్ని తెలుసుకునేలా అవకాశం ఇస్తూనే.. అదుపులో ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ, మొత్తానికే ఎసరు పెడితే ఏం లాభం?
ఎందుకీ వివక్ష?
మనం ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలలో ఎక్కువగా అమ్మాయిలే ఈ ఆంక్షలు విధించడం ఇక్కడ గమనార్హం. తల్లిదండ్రులు సైతం పదే పదే అబ్బాయిదేముందిలే.. ఏమవదు.. ఎప్పడైనా అమ్మాయిలకే ఇబ్బంది.. ఇలాంటి ధోరణిని తల్లిదండ్రులు మార్చుకోవాలి. అమ్మాయిలు ఇబ్బందుపడుతారనేది ఎంత నిజమో.. ఆన్ లైన్ మోసాల విషయంలో అబ్బాయిలు సైతం బాధితులుగా మారుతున్న విషయం మరిచిపోకూడదు. అబ్బాయిలకైతే సమస్యలేముండవు.. అమ్మాయిలే సమస్యలెదుకుంటారు అనేది ఆలోచన సమర్థనీయం కాదు. తల్లిదండ్రలు ఈ వివక్ష మాని.. అప్రమత్తతను నేర్పించడం మంచిది. అదే వారి భవిషత్తుకు లాభం చేకూర్చుతుంది.
ఎవరెంత ప్రోత్సహించినా.. కుటుంబం అందించే ప్రోత్సాహంతో సాటి రాదు.. వారి చెప్పే చిన్న మాటలే.. అందించే ప్రోత్సాహం.. భవిషత్తును బంగారుమయం చేస్తుందనడంలో సందేహం. కాబట్టి తల్లిదండ్రులు సందేహాలు మాని.. మీ బంగారు తల్లులను ప్రోత్సహించండి. ఉన్నత శిఖరాలు చేరుకునేలా వెన్ను తట్టండి.
Also Read ;- స్లమ్ ‘బ్యూటీ’.. మలీశా కర్వా











