కరోనా… మనిషి జీవితాలను పూర్తిగా మార్చేసింది. కరోనా రాకతో ఇప్పటికే మనుషుల జీవనవిధానం పూర్తిగా మారింది. మాస్కులు, శానిటైజర్లు అంటూ వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్త అలవాట్లు, అభిరుచులు మొదలయ్యాయి. కరోనా సమయంలో చాలామంది పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారు. కొవిడ్ వేళ వైరెటీగా ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా ఓ పెళ్లికార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ కార్డులో ఏముందంటే…
డిఫరెంట్ గా లగ్న పత్రిక
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన యూట్యూబర్ జీల అనిల్ కు పెళ్లి కుదిరింది. ‘వధూవరులకు కరోనా నెగిటివ్, మరువకుండా మీ ఫోన్ల 1-జీబీ డాటా ఆగపట్టుకొని పిల్లా..జెల్లా..ఐసోల్లు..ముసలోల్లు అందరూ ఫోన్ల ముందు అంతర్జాలంలో పెండ్లిసూసి ఆన్లైన్లో ఆశీర్వదించి… ఇక కట్నాలు, కానుకలు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా క్యూఆర్ స్కాన్ చేసి పంపండి’ అంటూ డిఫరెంట్ గా పెళ్లి కార్డు ప్లాన్ చేయడంతో వైరల్ గా మారింది.
Must Read ;- కరోనా వ్యాక్సిన్ : సంతోషమే బలం.. ధైర్యమే బలగం